Home

»

Latest News

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్: సర్జరీ తర్వాత మొదటిసారి మీడియా ముందుకు ఎన్టీఆర్.!

Sep 25, 2026 5:38PM

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్. త్వరలోనే ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ సందడి చేయబోతున్నారు. అదే ఫహాద్ ఫాజిల్ నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.

శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ మూవీపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ స్ట్రీట్ మ్యాజిషియన్ పాత్రలో కనిపించనున్నారు. సూపర్‌ నేచురల్ పవర్స్ ఉన్న ఓ అమ్మాయితో కలిసి ఆయన చేసే ప్రయాణం చుట్టూ కథ సాగుతుంది.

ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తున్నారు. అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో థియేటర్లలోకి రానుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 29న జరగనున్న ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నారట. 

భుజానికి సర్జరీ కారణంగా డ్రాగన్ మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి, ఎన్టీఆర్ కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత, అందునా గాయం తర్వాత ఎన్టీఆర్ ఒక మూవీ ఈవెంట్‌లో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఎంతో ఆసక్తి కనిపిస్తోంది.

కాగా, ఇటీవలి విడుదలైన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ట్రైలర్ కు నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్ అందించారు. ఆయన ఐకానిక్ డైలాగ్ నే ఈ సినిమాకి టైటిల్ గా పెట్టారు. ఇప్పటికే వాయిస్ ఓవర్ తో బాబాయ్ సినిమాని ప్రమోట్ చేస్తే, ఇప్పుడు అబ్బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే బాధ్యత తీసుకోనున్నారు.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. డ్రాగన్ మూవీ బిగ్ అప్డేట్.!

 

 

 

[Jr NTR For Dont Trouble The Trouble, Dont Trouble The Trouble Pre Release Event, Dont Trouble The Trouble Movie, Fahadh Faasil, Jr NTR, Nandamuri Balakrishna, SS Rajamouli, Telugu Film News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com