Home

»

Latest News

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌కు అత్యంత ఇష్టమైన సాంగ్ ఇదే.. లూప్‌లో వింటారట!

May 19, 2026

నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నింటిలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'దేవర' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న తారక్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే వెండితెరపై అలరించే యంగ్ టైగర్ వ్యక్తిగత ఇష్టాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే తారక్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన మ్యూజికల్ సీక్రెట్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

సాధారణంగా నటుడిగానే కాకుండా మంచి గాయకుడిగా కూడా ఎన్టీఆర్‌కు టాలీవుడ్‌లో మంచి పేరుంది. గతంలో ఆయన నటించిన యమదొంగ, కంత్రీ, ఊసరవెల్లి, రభస, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాల్లో పాటలు పాడి శ్రోతలను మెప్పించారు. ఇంతటి సంగీతాభిమానం ఉన్న తారక్ మొబైల్ ఫోన్‌లో నిరంతరం లూప్‌లో ప్లే అయ్యే ఒక ప్రత్యేకమైన సాంగ్ ఉంది. అదేంటో కాదు.. చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం' చిత్రంలోని "ఆశాపాశం" సాంగ్.

జీవిత తత్వాన్ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించే ఈ హార్ట్ టచింగ్ మెలోడీ అంటే ఎన్టీఆర్‌కు అమితమైన ఇష్టమట. గతంలో ఓ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తన సహనటుడు రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ రాజమౌళితో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో తారక్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మీ ఫోన్‌లో ఎక్కువగా వినే పాట ఏది అని యాంకర్ అడగ్గా.. క్షణం కూడా ఆలోచించకుండా 'ఆశాపాశం' అని సమాధానమిచ్చారు. అంతేకాదు ఆ ఇంటర్వ్యూలోనే ఈ పాటలోని కొన్ని లైన్లను తన మధురమైన గాత్రంతో పాడి వినిపించి అందరినీ ముగ్ధులను చేశారు.

ఎన్టీఆర్ పాడుతున్న సమయంలో పక్కనే ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందిస్తూ.. తారక్ చాలా అద్భుతంగా పాడగలడని కొనియాడారు. వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన 'కేరాఫ్ కంచరపాలెం' చిత్రానికి స్వీకర్ అగస్తీ అద్భుతమైన బాణీలు అందించగా.. విశ్వ సాహిత్యం సమకూర్చారు. ప్రముఖ గాయకుడు అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ గీతం ఎంతోమంది హృదయాలను హత్తుకుంది. గ్లోబల్ స్టార్ సైతం ఈ మెలోడీకి ఫిదా అవ్వడం విశేషం.

ఈ మ్యూజికల్ అప్‌డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. మాస్ అండ్ యాక్షన్ చిత్రాలతో అలరించే తారక్.. రియల్ లైఫ్‌లో ఇంతటి క్లాసిక్, లైఫ్ ఫిలాసఫీ ఉన్న పాటను ఇష్టపడతారా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఎన్టీఆర్ ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com