Home

»

Latest News

డ్రాగన్ రిలీజ్ డేట్: వాయిదాపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.!

Sep 30, 2026 11:28AM

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాను 2027, జూన్ 11న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు.

అయితే ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో 'డ్రాగన్' షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. దీంతో ఈ మూవీ జూన్ నుంచి అక్టోబర్ కి వాయిదా పడుతుంది అంటూ వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజంలేదని తేలిపోయింది.

తాజాగా జరిగిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ ప్రీ రిలీజ్ కి గెస్ట్ గా హాజరైన ఎన్టీఆర్.. 'డ్రాగన్' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. ముందుగా చెప్పినట్టుగా జూన్ 11నే విడుదలవుతుందని స్పష్టం చేశారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న మైత్రి నిర్మాతలు సైతం.. ఇదే విషయాన్ని తెలిపారు.

ఎన్టీఆర్ త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఆ తర్వాత త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్' పైకి తన ఫోకస్ ను షిఫ్ట్ చేయనున్నారు.

ఇది కూడా చదవండి: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ అంటే ఇదే.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ 

 

 

 

[NTR Dragon Release Date, Don't Trouble The Trouble, Jr NTR Speech, NTR Neel Movie, Dragon On June 11 2027, Jr NTR Latest, SS Rajamouli, Prashanth Neel, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com