Home

»

Latest News

Jr NTR: గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో జూనియర్ ఎన్టీఆర్ భారీ ప్రాజెక్ట్?

May 21, 2026

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు (మే 20) సందర్భంగా నందమూరి అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ లభించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ (Geetha Arts) అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతా ద్వారా తారక్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పవర్‌ఫుల్ స్పెషల్ మ్యాషప్ వీడియో ఎడిట్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. 

ఈ ప్రత్యేక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను పూర్తిగా షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ సినీ కెరీర్‌లోని ఐకానిక్ మాస్ సీన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ స్టెప్పులను కలగలిపి గీతా ఆర్ట్స్ ఈ ట్రిబ్యూట్ వీడియోను అత్యంత గ్రాండ్‌గా డిజైన్ చేసింది.

ఈ పుట్టినరోజు వేళ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న 'డ్రాగన్' (Dragon) చిత్రం నుండి అదిరిపోయే గ్లింప్స్ విడుదలై పండగ వాతావరణాన్ని తెచ్చింది. దీనికి తోడు గీతా ఆర్ట్స్ నుండి వచ్చిన ఈ క్రేజీ వీడియో నందమూరి అభిమానుల జోష్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. 

సాధారణంగా ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్ మరో హీరో పుట్టినరోజున ఇంత భారీ ఎత్తున స్పెషల్ ఎడిట్ వీడియోను విడుదల చేయడం ఇండస్ట్రీలో చాలా అరుదుగా జరుగుతుంది. దీంతో ఈ వీడియో కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలకే పరిమితం కాలేదు, దీని వెనుక ఒక పెద్ద సినిమా ప్లాన్ ఉందనే చర్చకు తెరలేపింది. 

గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడా? అంటూ సోషల్ మీడియాలో సరికొత్త చర్చలు, ఊహాగానాలు జోరందుకున్నాయి.

అయితే గీతా ఆర్ట్స్ టాలీవుడ్ టాప్ స్టార్స్ కి ట్రిబ్యూట్ ఇస్తూ, పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియోలు చేస్తోంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ వీడియో చేసిందని, అంటే తప్ప ప్రస్తుతానికి వీరి కాంబినేషన్ లో ఎటువంటి ప్రాజెక్ట్ లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com