Home

»

Latest News

Jetlee vs Gayapadda Simham: జెట్లీ, గాయపడ్డ సింహం ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే!..మరి విన్నర్ ఎవరు 

May 02, 2026

 

నిన్న వరల్డ్ వైడ్ గా జెట్లీ(Jetlee),గాయపడ్డ సింహం(Gayapadda Simham)చిత్రాలు ప్రేక్షకులు కూడా కార్మికులే కాబట్టి కార్మిక దినోత్సవం సందర్భంగా థియేటర్స్ లో తిష్ట వేద్దామని ల్యాండ్ అయ్యాయి. కానీ అనూహ్యంగా రెండు చిత్రాలకి నెగిటివ్ టాక్ చాలా బలంగానే స్ప్రెడ్ అవుతుంది. సాధారణంగా ఒకే రోజు రెండు చిత్రాలు రిలీజ్ అయినప్పుడు ఒక చిత్రం బాగోకపోతే మరో చిత్రం పర్వాలేదనే స్థాయిలో ఉన్నా  విజయం అంచున నిలబడుతుంది. కానీ ఆ సూత్రం మాకు వర్తించదులే, ఒకే రోజు వచ్చాం కాబట్టి రిజల్ట్ విషయంలో సమన్యాయం పాటిస్తామని ప్లాప్ ని గట్టిగానే పట్టుకున్నాయి.  మరి ఈ రెండు చిత్రాలు తొలి రోజు ఎంత కలెక్షన్స్ ని వసూలు చేశాయని రిపోర్ట్స్ వస్తున్నాయో చూద్దాం.

 జెట్లీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా  1 .5 కోట్ల  గ్రాస్ ని సాధించట్టుగా వార్తలు వస్తున్నాయి. సినిమాకి వచ్చిన క్రేజ్ బట్టి ఇది చాలా తక్కువ అని చెప్పవచ్చు. మరి ఎండింగ్ కలెక్షన్స్ ఎంతో చూడాలి. పదికోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్టు టాక్.  గాయపడ్డ సింహం తొలి రోజు వరల్డ్ వైడ్ గా కోటి రూపాయల గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తుంది. పన్నెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందనేది టాక్ కాగా మరి ఎన్ని రోజులు థియేటర్స్ లో ఉంటుంది, ఎంత రాబడుతుందో అనేది ఆసక్తిగా మారింది. రెండు చిత్రాల మేకర్స్ మాత్రం కలెక్షన్స్ వివరాలని అధికారకంగా  వెల్లడి చెయ్యలేదు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com