ఆమె ప్రపంచంలో అందరికంటే అందగత్తె..!
on Apr 21, 2016
పీపుల్స్ మ్యాగజైన్ ప్రతీ ఏడాదీ ప్రపంచంలో అందమైన మహిళను, పురుషుడినీ ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారిని ప్రపంచంలోనే అందమైన వాళ్లని కితాబిస్తారు. దీనిలో భాగంగా, పీపుల్స్ మ్యాగజైన్ ఈ ఏడాది జెన్నిఫర్ ఆనిస్టన్ ను ఎంపిక చేసింది. ఇలా ఎంపిక కావడం జెన్నిఫర్ కు రెండోసారి కావడం విశేషం. 2004లో కూడా జెన్నిఫర్ కు ఈ ఘనత లభించింది. ఇప్పటి వరకూ అనేక హాలీవుడ్ సినిమాల్లో నటించిన జెన్నిఫర్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. బ్రూస్ ఆల్మైటీ, బ్రేకప్ సినిమాలు ఆమె కెరీర్లో బాగా పేరు తెచ్చిపెట్టాయి. 47 ఏళ్ల ఆనిస్టన్ త్వరలోనే మదర్స్ డే సినిమాతో రానుంది. ఈ వయసులో కూడా ఆమెకు అందగత్తెగా పీపుల్స్ పట్టం కట్టడం విశేషం.