Home

»

Latest News

ఆడపిల్ల సంపాదన మీద బ్ర‌తికే మగమహారాజుల క‌ళ్లు తెరిపించే సీన్‌!

Apr 01, 2026

- జీతం గురించి అడిగిన త‌ల్లికి కూతురు ఇచ్చిన దిమ్మతిరిగే సమాధానం

- కళ్ళలో నీళ్లు తెప్పించే జయప్రద నటన 

- మధ్యతరగతి ఆడబిడ్డ ఆవేదనకు అద్దం పట్టిన దృశ్యం
 

మధ్యతరగతి కుటుంబాలలో ఆడపిల్ల అంటే కేవలం బాధ్యత మాత్రమే కాదు, ఆ ఇంటికి వెన్నెముక. కానీ, అదే ఆడపిల్ల తన రక్తాన్ని చెమటగా మార్చి సంపాదిస్తుంటే, ఆ సంపాదన మీద కక్కుర్తి పడే మనుషులు ఉంటే.. ఆ నరకం ఎలా ఉంటుందో ఈ భావోద్వేగ సన్నివేశం మన కళ్లకు కడుతుంది. అలనాటి మేటి నటి జయప్రద తన అద్భుత నటనతో ఒక మధ్యతరగతి యువతి పడే సంఘర్షణను వెండితెరపై ఆవిష్కరించారు.

మ‌ధ్య త‌ర‌గ‌తి జీవితాల‌ను తెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించే దిగ్ద‌ర్శ‌కుడు కె.బాల‌చంద‌ర్ రూపొందించిన అంతులేనిక‌థ చిత్రంలోనిదీ స‌న్నివేశం. జ‌య‌ప్ర‌ద ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాలో ర‌జినీకాంత్‌, కమల్ హాసన్, ప్రసాద్‌బాబు, ఫ‌టాఫ‌ట్ జ‌య‌ల‌క్ష్మి, శ్రీ‌ప్రియ ఇత‌ర పాత్ర‌లు పోషించారు. 

 

 

 

ఒక కూతురి కష్టం, ఒక తల్లి అసహాయత అదేవిధంగా బాధ్యత లేని తండ్రి, కొడుకుల ప్రవర్తన. జీతం కోసం ఎదురుచూసే త‌ల్లికి తన కూతురు పడే కష్టం కనబడదు. "ఈ నెల జీతం 50 రూపాయలు పెంచారు అన్నావుగా.. మరి నాకు ఇచ్చే డబ్బులు ఎందుకు తగ్గించావు?" అని ఆ త‌ల్లి అడిగే ప్రశ్న, సమాజంలో ఉన్న కొందరు మ‌నుషుల స్వార్థానికి నిలువుటద్దం పడుతుంది.

ఆఫీసులో చాకిరీ చేసి, బస్సుల్లో రద్దీని తట్టుకుని, ఇంటికి రాగానే ఆదరణ కరువైన వేళ.. ఆమె నోటి వెంట వచ్చే మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. "జీతం పెంచింది నా తెలివితేటలకు, నా కష్టానికి.. మీరు విలాసాలు చేసుకోవడానికి కాదు" అని ఆమె గర్జించే తీరు ఒక స్ఫూర్తినిస్తుంది. ఇంటి యజమానిగా పేరుండి, బాధ్యతలు గాలికి వదిలేసిన అన్న‌య్య‌ని చూసి ఆమె పడే ఆవేదన కళ్ళలో నీళ్లు తిరిగేలా చేస్తుంది.

తిని తిరగడమే పనిగా పెట్టుకున్న అన్నయ్య ప్రవర్తన ఆ ఇంటిని మరింత కుంగదీస్తుంది. "జగమే మాయ.. బ్రతుకే మాయ" అంటూ తాగి వచ్చి వేదాంతాలు పలికే అన్నయ్యను చూస్తుంటే, ఒక చెల్లిగా ఆమె ఎంత క్షోభ అనుభవిస్తుందో అర్థమవుతుంది. ఆబోతుల్లా మేసే మనుషులను భరించడం నా వల్ల కాదు అని ఆమె తెగేసి చెప్పడం ఆమె ధైర్యానికి నిదర్శనం.

చివరికి, "ఈ తలరాతలను కొంతకాలం దూరంగా ఉంచితే, ఈ ఇంటి రాతే మారిపోతుంది" అని ఆమె చెప్పే మాటలు జీవిత సత్యాన్ని బోధిస్తాయి. తన కుటుంబం కోసం తపించే ఒక ఆడబిడ్డను గౌరవించలేని మనుషులు ఉన్నచోట ఉండలేక, ఆమె పడే సంఘర్షణ గుండెలను పిండేస్తుంది. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవ్వడమే కాకుండా, తమ ఇంట్లోని ఆడబిడ్డల విలువను గుర్తించేలా చేస్తుంది.

ఆడ‌పిల్ల సంపాద‌న‌పై ఆధార‌ప‌డే మ‌గ‌మ‌హారాజుల క‌ళ్లు తెరిపించేలా ఈ స‌న్నివేశాల‌ను మ‌లిచారు ద‌ర్శ‌కుడు బాల‌చంద‌ర్‌. పైకి క‌ఠినంగా క‌నిపించినా స‌ముద్ర‌మంత క‌న్నీరు దాచుకున్న స‌రిత పాత్ర‌లో జ‌య‌ప్ర‌ద జీవించార‌ని చెప్పాలి. చూసిన ప్ర‌తి ఒక్క‌రినీ భావోద్వేగానికి లోను చేసే ఈ వీడియోను మీకు అందిస్తున్నాం. ఇలాంటి మ‌రిన్ని మంచి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com