Home

»

Latest News

టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం.. వెంకటేశ్వర స్వామి పాత్రలో జయం రవి.!

Aug 4, 2026 3:45PM

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రీ ఎంట్రీ తర్వాత సరికొత్త ఎనర్జీ, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రాజెక్టులలో 'వడ్డీ కాసుల వాడా' ఒకటి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించింది. మధ్యతరగతి జీవితాల్లో ఈఎంఐలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందుల చుట్టూ తిరిగే కథాంశంతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపుదిద్దుతున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం సినీ వర్గాల్లో ఒక క్రేజీ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే, ఈ సినిమాలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాత్రలో ప్రముఖ కోలీవుడ్ నటుడు జయం రవి నటించబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది. 

ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మనోజ్ కనిపించనున్నారు. అప్పుల తిప్పల నుంచి బయట పడేయమని ఆ వడ్డీ కాసుల వాడిని వేడుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర స్వామికి, మనోజ్ జరిగే సంభాషణలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మరి ఆ శ్రీనివాసుడి పాత్రలో జయం రవి ఎలా ఉంటారో చూడాలి. 

 

 

Manchu Manoj, Vaddi Kaasula Vaada, Jayam Ravi, Venkateswara Swamy

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com