Home

»

Latest News

janhvi kapoor: టాలీవుడ్‌ కి ఇక గుడ్ బై.. అసలు కథ ఇదేనా?

Jul 3, 2026 4:54PM

 

గత నెల 4 న 'పెద్ది'(Peddi)తో జాన్వీకపూర్ 'అచ్చాయమ్మ'గా సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. దేవర తన తొలి చిత్రం కాగా పెద్ది సెకండ్ మూవీ. అభిమానులు అయితే దేవర తో హిట్ అందుకున్న జాన్వీ పెద్దితో నెంబర్ వన్ హీరోయిన్ అనే టాగ్ లైన్ పొందింది.  కానీ అందుకు భిన్నంగా జాన్వీ క్యారక్టర్ ని మేకర్స్ ఎస్టాబ్లిష్ చేసిన విధానంపై బాలీవుడ్ నుంచి పలు విమర్శలు వచ్చాయి. జాన్వీ కూడా తన క్యారక్టర్ విషయంలో అసంతృప్తిగా ఉందనే టాక్ వచ్చింది.

ఈ న్యూస్ నిజమే అనేలా పెద్ది సక్సెస్ మీట్‌ కి సైతం జాన్వీ కపూర్ దూరంగా ఉంది. దాదాపు 8 కోట్ల భారీ పారితోషికం తీసుకున్నప్పటికీ, ఆశించిన స్థాయి గుర్తింపు రాకపోగా ఇలాంటి వివాదాలు ఎదుర్కోవడం కూడా జాన్వీ ని కలవరపెడుతుందని టాక్ . పైగా ఇప్పటికే వరుసగా రెండు పెద్ద చిత్రాల్లో కనిపించినప్పటికీ, నటన పరంగా తనను తాను నిరూపించుకోలేదనే విమర్శలని కూడా జాన్వీ మోయాల్సి వస్తుందని అంటున్నారు.ఈ క్రమంలో జాన్వీ ఇకపై తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందా? లేక భవిష్యత్తులో సరైన స్క్రిప్టుల కోసం వేచి చూస్తుందా? అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా, టాలీవుడ్ ప్రయాణంలో జాన్వీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు అభిమానులని ఆందోళనకి  గురిచేస్తున్నాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఇకపై ప్రాజెక్టుల ఎంపికలో జాన్వీ మరింత జాగ్రత్తగా ఉండాలని తన టీమ్ సూచిస్తోందని సమాచారం. ప్రస్తుతానికైతే జాన్వీ ఖాతాలో ఎలాంటి కొత్త తెలుగు చిత్రాల కమిట్ మెంట్స్ లేవు.

also read: Jayam ravi: జయం రవి ఇంట్లో భారీ దొంగతనం... చేసింది అతనే అంటారా!



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com