ఆయన్ను చూస్తే చాలనుకున్నా..ఆయనకే కట్ చెప్పా
on Aug 12, 2016
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమాలో ప్రఖ్యాత నటుడు, మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కీలకపాత్ర పోషించారు. ఆడియో వేడుకలో డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ స్కూల్ లో చదువుతున్నప్పుడు మోహన్ లాల్ సినిమాలు చూస్తూ పెరిగానని, జీవితంలో ఆయనను చూస్తే చాలు.. అనుకునే తాను ఆయనకు దర్శకుడిగా 'యాక్షన్' చెప్పానని, అంతకంటే గొప్ప విషయం ఏముంటుందని ఆయన అన్నారు. నటనంటే ప్రాణం పెట్టే..మోహన్‌లాల్, ఎన్టీఆర్‌లను ఒకే ఫ్రేమ్‌లో పెట్టినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని తాను బలంగా నమ్ముతున్నానని ఆయన తెలిపారు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.