Home

»

Latest News

ఎన్టీఆర్ ఎందుకు ఒప్పుకొన్నాడో??

Sep 1, 2016 3:16PM

భారీ అంచ‌నాల మ‌ధ్య జ‌న‌తా గ్యారేజ్‌ విడుద‌లైంది. సినిమా టాక్ ర‌క‌ర‌కాలుగా ఉంది. బెనిఫిట్ షో చూసిన ఫ్యాన్స్ సైతం... డీలా మొహాల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చారు. అస‌లు ఇలాంటి క‌థ ఎన్టీఆర్ ఎందుకు ఒప్పుకొన్నాడ‌న్న‌దే అంద‌రినీ వేధిస్తున్న ప్ర‌శ్న‌. జ‌న‌తా గ్యారేజ్ ప్రాజెక్ట్ సెట్ కావ‌డానికి, కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌డానికి ఎన్టీఆర్ తెగ తాప‌త్ర‌య‌ప‌డ్డాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. ఎట్టిప‌రిస్థితుల్లోనూ కొర‌టాల‌తో సినిమా చేయాల‌న్న ఉద్దేశంతో ఎన్టీఆర్ త‌న రెమ్యున‌రేష‌న్‌ని కూడా త‌గ్గించుకొన్నాడ‌ని చెప్పుకొన్నారు. నిజంగా క‌థ‌లో అంత ద‌మ్ముందేమో... అందుకే ఎన్టీఆర్ ఇంత‌లా వెంట‌ప‌డుతున్నాడు అనుకొన్నారంతా. కానీ జ‌న‌తా గ్యారేజ్‌లో క‌థే లేదు. స‌ర్కార్ సినిమాని చూసిన‌ట్టు అనిపించింద‌ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది వాపోతున్నారు. సెకండాఫ్‌లో బ‌లం లేదని, చాలా సీన్లు తేలిపోయాయ‌ని రివ్యూలు కూడా చెబుతున్నాయి. అయినా సరే... ఎన్టీఆర్‌కి తెగ న‌చ్చేసింది.  రామ్‌చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్‌లకు కొర‌టాల ఈ క‌థే చెప్పాడ‌ని వాళ్లు `నో` అన్నార‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంటే.. ఇద్ద‌రు హీరోలు వ‌దులుకొన్న క‌థ‌ని కావాల‌ని ఎన్టీఆర్ చేశాడ‌న్న‌మాట‌. అందుకే ఇలాంటి ఫ‌లితం ఎదురైంది. 
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com