Home

»

Latest News

ఏంటి బాబు తెలుగు నాట ఈ థియేటర్స్.. రచ్చ రచ్చ ఖాయమా! 

Jul 21, 2026 10:36AM

 

ఇళయ దళపతి విజయ్(VIjay)'జననాయగన్'(janaNayagan)గా సెల్యులాయిడ్ పై పెర్ఫార్మ్ చేస్తుంటే అభిమానులు, ప్రేక్షకులకి వచ్చే మజాకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందనే కంటే గంటలే అని చెప్పవచ్చు. తమిళనాడుతో పాటు ఆంధ్ర, తెలంగాణాలో కూడా తెల్లవారు జామునే షోస్ పడబోతున్నాయి. దీంతో విజయ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది.


తెలుగులో 'జననాయకుడు' పేరుతో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో విజయ్ కి ఉన్న తిరుగులేని స్టార్‌డమ్, మాస్ ఫాలోయింగ్‌ని దృష్టిలో ఉంచుకుని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు బిగ్ ప్లానింగ్ తో రంగంలోకి దిగారు.  తెలుగు రాష్ట్రాల్లో ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్‌వీసీ (SVC) బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. విజయ్ సినిమాకు ఇక్కడ ఉన్న విపరీతమైన క్రేజ్‌ని  డిస్ట్రిబ్యూషన్ వర్గాలు గట్టిగా నమ్ముతుండటంతో, ప్రధాన నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు భారీ ఎత్తున థియేటర్లను కేటాయించారు. రాజధాని హైదరాబాద్‌లోనైతే హడావుడి మరింత ఎక్కువగా ఉంది. నగరంలోని పాపులర్ సింగిల్ స్క్రీన్‌లు అన్నింటినీ 'జననాయకుడు' కోసమే ప్రత్యేకంగా లాక్ చేసి ఉంచారు. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లన్నింట్లోనూ ఉదయం 8 గంటల నుంచే ప్రత్యేక షోలు ప్రారంభమయ్యేలా షెడ్యూల్స్ సిద్ధం చేశారు.  హైదరాబాద్ నగరంలోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్, పివిఆర్, ఐనాక్స్, మరియు ఏషియన్ నెట్‌వర్క్ థియేటర్లని  కేటాయించడం సినీ వర్గాలను సైతం విస్తుపోయేలా చేస్తోంది. ప్రతి రోజూ ఒక్కో ప్రముఖ మల్టీప్లెక్స్ ప్రాంగణంలోనే దాదాపు 15 నుండి 20 షోల వరకు కేవలం ఈ ఒక్క సినిమాకే కేటాయించడం విశేషం. సాధారణంగా గురువారం రోజు సినిమా విడుదల ఉంటే, రెండు మూడు రోజుల ముందే అంటే సోమవారమే అడ్వాన్స్ బుకింగ్‌లను ఓపెన్ చేయడం ద్వారా దిల్ రాజు జన నాయకుడుపై ఎంత నమ్మకంతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.  కేవలం హైదరాబాద్ లేదా నైజాం ఏరియాలోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రాంతాల్లోనూ 'జననాయకుడు' థియేటర్ల కౌంట్, షోల సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది.

సాధారణంగా ఒక డబ్బింగ్ సినిమాకి  తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో థియేటర్లు కేటాయించడం నిజంగానే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. ఒక రకంగా చెప్పాలంటే స్ట్రెయిట్ తెలుగు పెద్ద సినిమాలకు సమానంగా ఈ డబ్బింగ్ చిత్రానికి స్క్రీన్లు దక్కాయి. మొదటి రోజే రాబోయే బిగ్ ఓపెనింగ్స్ ద్వారా భారీ వసూళ్లను రాబట్టడమే లక్ష్యంగా డిస్ట్రిబ్యూటర్లు ఈ స్థాయిలో ప్లాన్ చేశారు.  అయితే, మరోవైపు అసలు విషయాన్ని గమనిస్తే, ఇప్పటికే ఓపెన్ చేసిన అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ట్రేడ్ పండితులు ఆశించిన స్థాయిలో లేవనే వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం 'భగవంత్ కేసరి'కి రీమేక్‌గా ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆ కథ మన తెలుగు ప్రేక్షకులకి బాగా తెలిసి ఉండటం కూడా బుకింగ్స్‌పై ప్రభావం చూపుతోందనే మాటలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ దళపతి విజయ్ ఆఖరి సినిమా కావడంతో పాటు తెలుగు నాట ఏ మేర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందో చూడాలి.

vijay, jananayagan, dil raju, jananayakudu
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com