Home

»

Latest News

Jananayagan: జననాయగన్ కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Apr 1, 2026 6:29PM

 

 

-ఎలక్షన్ క్యాంపెయిన్ లో విజయ్ బిజీ
-ఈ నెల 23 న ఎన్నికలు 
-వైరల్ అవుతున్న జననాయగన్ కొత్త రిలీజ్ డేట్


భాష కంటే మనిషి అంతరాత్మ నుంచి వచ్చే భావం గొప్పది. ఆ అంతరాత్మకి అందరు బద్దులు కాబట్టి భాషతో సంబంధం లేకుండా ఏ మనిషి భావం అయినా ఇట్టే అర్థమైపోతుంది. మరి ముఖ్యంగా ఈ సత్యం సినీ ప్రియుల ద్వారా అందరి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. ఈ కోవలోనే రీసెంట్ గా ఇళయ దళపతి విజయ్(Vijay)అభిమానులు 'బొబ్బిలిపులి' లోని ఎన్టీఆర్(Ntr)సాంగ్  'సంభవం, నీకే సంభవం' అనే సాంగ్ ని పాడుకుంటున్నారు. పైగా పొలిటికల్ పరంగాను సదరు న్యూస్ విజయ్ కి లింక్ అవ్వడం గమనార్హం. అసలు మ్యాటర్ చూద్దాం.

జననాయగన్(Jananayagan)ఈ నెల 24 న రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు, వంకలు ఉండవని, రిలీజ్ పక్కా  అంటున్నారు. దీంతో అభిమానులు తమ సుదీర్ఘ నిరీక్షకి తెరదించుతు జననాయకుడు రావాలని, సిల్వర్ స్క్రీన్ ని చెడుగుడు ఆడాలని బొబ్బిలిపులిలోని సాంగ్ పాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ పై సినీ విశ్లేషకులు స్పందిస్తు ఏప్రిల్ 24 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే  ఏప్రిల్ 23 న తమిళనాడు ఎన్నికలు కంప్లీట్ కాబోతున్నాయి. మూవీలో రాజకీయ నాయకులపై, ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై శృతిమించిన విమర్శలు ఉండటంతో సెన్సార్ అడ్డుకట్ట వేసింది. దీంతో 24 న రిలీజ్ కి అడ్డు ఉండదని అంటున్నారు.


Also read:  Rashika Shetty: హీరోయిన్‌కి టార్చర్.. నీ ఫేస్‌కి బంగారు గొలుసు వేసుకునేంత సీన్ ఉందా!

ఇక లేట్ అయినా జన నాయగన్ కాస్ట్ గురించి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. సినిమాతో పాటు విజయ్ కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ అది. 
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com