
కోలీవుడ్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. సెన్సార్ సంబంధిత వివాదాలు, ఆన్‌లైన్ హెచ్‌డీ లీక్ వంటి అనేక అవరోధాలను దాటుకుని ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అయింది. సీఎం విజయ్‌ను వెండితెరపై చివరిసారిగా చూసేందుకు ఆయన అభిమానులు వేకువజాము నుంచే థియేటర్ల వద్దకు పోటెత్తారు. రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సంచలనం సృష్టించింది. మొదటిరోజే దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ సాధించే దిశగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ప్రారంభించింది.
థియేటర్లో పడిన స్పెషల్ హీరో టైటిల్ కార్డ్ ప్రేక్షకులలో, ముఖ్యంగా అభిమానులలో ఊహించని రేంజ్ జోష్ నింపింది. సాధారణంగా గతంలో విజయ్ చిత్రాల్లో ‘దళపతి విజయ్’ అని టైటిల్ పడేది, కానీ ఈసారి అనూహ్యంగా ‘గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్’ (Hon’ble Chief Minister of Tamil Nadu C. Joseph Vijay) అని స్క్రీన్ పై దర్శనం ఇవ్వడంతో థియేటర్లన్నీ విజిల్స్, కేకలతో హోరెత్తిపోయాయి. రాజకీయ సభల్లో ఆయన చూపించిన సిగ్నేచర్ మూమెంట్‌ను టైటిల్ కార్డ్‌లో పొందుపరచడం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది.
దర్శకుడు హెచ్. వినోద్ ఈ చిత్రాన్ని తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ మూల కథ స్ఫూర్తితో తెరకెక్కించినప్పటికీ, కేవలం మొదటి 20 నిమిషాలు, మమితా బైజు పాత్రకు సంబంధించిన ఎమోషనల్ సీన్లు మాత్రమే దానికి దగ్గరగా ఉంటాయని నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటున్నారు. విజయ్ పొలిటికల్ ఇమేజ్‌కు, మాస్ ఇమేజ్‌కు అనుగుణంగా వినోద్ ఈ కథలోని విలన్ ట్రాక్, యాక్షన్ బ్లాక్స్, పొలిటికల్ ఎలిమెంట్స్‌ను పూర్తిగా సరికొత్తగా మార్చి రాశారని నెటిజన్లు కొనియాడుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లోని ‘దళపతి కచేరీ’ పాట, ఇంటర్వెల్ వద్ద వచ్చే పవర్‌ఫుల్ ఫైట్ సీక్వెన్స్, పొలిటికల్ డైలాగ్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
సినిమాలోని ప్రధాన నటీనటులు తమ పాత్రల్లో లీనమై నటించారు. విలన్‌గా బాబీ డియోల్ తన పవర్‌ఫుల్ నటనతో మెప్పించగా, పూజా హెగ్డే గ్లామర్‌తో, మమితా బైజు ఎమోషనల్ పర్ఫార్మన్స్‌తో ఆకట్టుకున్నారు. ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి తమ వంతు పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన 'రావణ దా' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి మాస్ సన్నివేశాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లీక్ వంటి సమస్యలు ఉన్నప్పటికీ, దళపతి చివరి సినిమాను థియేటర్లలోనే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనే అభిమానుల ఆరాటం బాక్సాఫీస్ సునామీగా మారింది. మొత్తానికి విజయ్ తన నటన, డ్యాన్స్, ఫైట్స్ తో సినిమాను ఒంటిచేత్తో నడిపించిన "వన్ మ్యాన్ షో" అని సోషల్ మీడియా వ్యాప్తంగా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Jana Nayagan Review, Jana Nayakudu Review, Twitter Review, Thalapathy Vijay, Balakrishna





