
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం 'జన నాయగన్' ( తెలుగులో 'జన నాయకుడు'). హెచ్. వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా వచ్చిన అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం యొక్క అధికారిక విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేస్తూ, ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
"నిప్పుతో పరీక్షించబడింది, కాలంతో మలచబడింది, చరిత్ర కోసం నిర్మించబడింది. పోరాటం ఎంత కఠినంగా ఉంటే, విజయం అంత ఘనంగా ఉంటుంది." అంటూ ఈ సినిమాపై అంచనాలను పెంచే విధంగా వారు ఇచ్చిన క్యాప్షన్ ప్రేక్షకులలో ఉత్కంఠను రేపుతోంది. దళపతి విజయ్ చేతిలో కత్తి పట్టుకొని, పోలీస్ గెటప్ లో ఉన్న లుక్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. జూలై 23న ఈ చిత్రం థియేటర్లలో అడుగు పెట్టనుంది.
ఈ 'జననాయకుడు' ప్రాజెక్టును కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
విజయ్ ఆఖరి చిత్రం కావడంతో, సీఎం అయిన తర్వాత మొదటి సినిమా కావడంతో 'జననాయకుడు' కోసం కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా, ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూలై 23న విడుదల కానున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
Thalapathy Vijay, Jana Nayagan, H Vinoth, Anirudh Ravichander, KVN Productions





