Home

»

Latest News

VIJay:సౌత్ ఇండస్ట్రీ నుంచి అతన్ని బ్యాన్ చేసారు..ఇక సినిమాలు చేయడానికి వీల్లేదు

Apr 27, 2026

 

 

 

ప్రస్తుతం తమిళనాట ఎక్కడ చూసినా  మే 4 న ప్రకటించే ఎన్నికల ఫలితాలతో  విజయ్(VIjay)ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంటాడా లేదా అనే ఒకటే చర్చ. ఇండియా మొత్తం ఇదే చర్చ అనుకోండి.  సర్వేల ప్రకారం చూసినా కొన్ని విజయ్ కి పాజిటివ్ గా మరికొన్ని నెగిటివ్ గా వస్తున్నాయి. ఈ లోపు విజయ్ సినీ జర్నీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

 విజయ్ అప్ కమింగ్ మూవీ ‘జననాయగన్' (Jananayagan)పైరసీ జరిగిన విషయం తెలిసిందే. పైరసీ చేసింది ఎవరో కాదు ఫ్రీలాన్స్‌ ఎడిటర్‌ ప్రదీప్‌ ఇ.రాఘవ్‌. ఇప్పుడు సదరు ఎడిటర్ పై సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ  అసోసియేషన్‌ నుంచి ప్రదీప్ ని సస్పెండ్‌ చేస్తున్నట్లుగా మొన్న పత్రికా ప్రకటన విడుదల చేసింది.దీంతో ప్రదీప్ తన సినీ లైఫ్ ఎలా ఉంటుందో కలలు కనడమే కానీ కలలు నిజమయ్యే పరిస్థితి లేదు. పైరసీ వ్యవహారంలో రాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ విభాగం కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి  మొదట ఆరుగురుని, ఆ తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేయగా.. వీరిలో ప్రదీప్‌ ఇ.రాఘవ్‌‌ ఒకరు. 

 ప్రదీప్‌ ఇ.రాఘవ్‌ వేరే మూవీకి  ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. ‘జననాయగన్’ సినిమా ఎడిటింగ్ స్టూడియోలో అతనికి అనుమతి లేనప్పటికీ, అనధికారికంగా సినిమా రీల్స్‌ ని యాక్సెస్ చేసి డేటాను దొంగిలించినట్లుగా సైబర్‌ క్రైమ్‌ విభాగం కనుగొంది. ఆ దొంగిలించిన డేటాను సినిమాగా మార్చి, తన సహ నిందితులకు షేర్ చేయడంతో  ఆన్‌లైన్‌లో కూడా కంటెంట్ ని ప్రదర్శించడం జరిగింది. హెచ్. వినోద్(H Vinoth)దర్శకత్వంలో  కేవీఎన్ ప్రొడక్షన్ వెంకట్ కె. నారాయణ సుమారు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. పూజా హెగ్డే, మమిత భైజు కీలక రోల్స్ లో చెయ్యగా జన నాయగన్ రిలీజ్ డేట్ కోసం అయితే ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఇప్పటికి వెయిటింగ్.

 



 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com