Home

»

Latest News

స్పెయిన్ నటికి కరోనా

Mar 19, 2020 1:18PM

కరోనా బారిన పడుతున్న హాలీవుడ్ నటీనటుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కరోనా కేసుల జాబితాలో హాలీవుడ్ నటులు ఒక్కొక్కరుగా చేరుతున్నారు. టామ్ హాంక్స్ కరోనా వైరస్ బారి నుండి క్షేమంగా బయటపడ్డారు. అందుకు ఆస్ట్రేలియాలో డాక్టర్లకు థాంక్స్ చెప్పాలి. అయితే... ఆయన వైఫ్ రీటా ఇంకా క్వారంటైన్ లో ఉన్నారు. ప్రజెంట్ జేమ్స్ బాండ్ సినిమా 'క్వాంటమ్ ఆఫ్ సోలెస్' హీరోయిన్  ఓల్గా కురిలెంకో, 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నటుడు క్రిస్టఫర్ హివ్జు, 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్'లో నటించిన ఇడ్రిస్ ఎల్బా, 'హ్యాపీ డెత్ డే' యాక్ట్రెస్ రాచెల్ మాథ్యూస్ కరోనాకి చికిత్స తీసుకుంటున్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... స్పానిష్ యాక్ట్రెస్ ఇట్‌జైర్ ఇటునో (itziar ituño) వైద్య పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె చాలా సినిమాలు, స్టేజి ప్లేస్, టీవీ షోలు చేశారు. నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ 'మనీ హెయిస్ట్'తో వివిధ దేశాల్లో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com