
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘వాల్తేరు వీరయ్య’ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ బాబీ కొల్లి కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై మెగా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సుమారు రూ. 300 కోట్ల భారీ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న మెగాస్టార్, ఇప్పుడు తన 158వ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి చిత్ర మేకర్స్ తాజాగా ఒక సాలిడ్ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. (Mega 158)
దర్శకుడు బాబీ టేకింగ్, మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ గ్రేస్.. ఈ రెండింటి కలయికకు విజువల్ గా అదిరిపోయే అవుట్‌పుట్ ఇచ్చేందుకు టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘జైలర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకూ మహారాజ్’, రాబోయే క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’ వంటి భారీ పాన్-ఇండియా సినిమాలతో తన కెమెరా పనితనానికి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో విజయ్ కార్తిక్ ఇప్పటికే నిరూపించుకున్నారు.

విజయ్ కార్తిక్ కన్నన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌లోకి ఆయనకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతంలో డైరెక్టర్ బాబీతో కలిసి పని చేసిన అనుభవం ఉండటంతో, ఈసారి చిరంజీవి కోసం సరికొత్త బెస్ట్ విజువల్స్ అందించడానికి ఆయన సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన చిరంజీవి జిమ్ వర్కౌట్ వీడియోలు, లుక్ టెస్ట్ ఇమేజెస్ చూస్తుంటే ఈ సినిమాలో బాస్ మునుపెన్నడూ చూడని అత్యంత స్టైలిష్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. మాస్ నాడి పూర్తిగా తెలిసిన దర్శకుడు బాబీ, ఈసారి థియేటర్లలో సీట్లు వదిలి అభిమానులు పూనకాలతో డ్యాన్సులు చేసేలా హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, గూస్‌బంప్స్ తెప్పించే మాస్ ఎలివేషన్స్‌తో ఒక అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారట.






