
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)స్టార్ డమ్ ని మరింత ఎలివేట్ చేస్తు నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilipkumar)తెరకెక్కించిన 'జైలర్' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్స్ కూడా ఒక సంచలనం. దీంతో సీక్వెల్ గా తెరకెక్కిన 'జైలర్ 2’(Jailer 2)పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ బిజినెస్ క్లోజ్ కాకముందే సరికొత్త రికార్డులని సృష్టిస్తోంది. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ సినిమాకు మునుపెన్నడూ లేని విధంగా ఊహించని డిమాండ్ ఏర్పడింది.
మొదటి భాగం 'జైలర్' లో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ పోషించిన మాత్యూస్ క్యారక్టర్ కేరళ బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పించింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, రజినీకాంత్‌తో కలిసి వచ్చే మాస్ ఎలివేషన్స్ కేరళలో థియేటర్లని షేక్ చేశాయి. కేరళలో కేవలం ఒకే ఒక్క గెస్ట్ రోల్‌తో సినిమా కలెక్షన్లని అమాంతం పెంచేసిన మోహన్‌లాల్ మ్యాజిక్, ఇప్పుడు 'జైలర్ 2' బిజినెస్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. సీక్వెల్‌లో కూడా ఆయన రోల్ మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందనే లీకులు రావడంతో మలయాళ థియేట్రికల్ హక్కుల కోసం కేరళ డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. పోటీపడి మరీ భారీ ఆఫర్లను ఇస్తుండటంతో, సినిమా విడుదల కాకముందే సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి.
Also read: Babumohan: బాబుమోహన్ సెకండ్ ఇన్నింగ్స్..ఆ 15 సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇక రజినీ ముత్తువేల్ పాండియన్ గా ఈసారి మరింత వైల్డ్‌గా, మరింత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. 'ది టైగర్ ఈజ్ బ్యాక్ ఆన్ ది హంట్' అంటూ మేకర్స్ వదిలిన క్రేజీ లైన్స్ అయితే సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. మోహన్‌లాల్‌తో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, ఎస్. జే. సూర్య, రమ్యకృష్ణన్, యోగి బాబు వంటి భారీ తారాగణం నటిస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. వీటికి తోడు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ,మ్యూజిక్ మరో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అక్టోబర్ 15 రిలీజ్ డేట్.
Rajinikanth, nelson dilipkumar, mohanlal, jailer 2





