Home

»

Latest News

క్రేజీ కాంబో.. రజనీకాంత్ సినిమాలో హృతిక్ రోషన్! 

May 28, 2026 2:31PM

సూపర్‌స్టార్ రజనీకాంత్, టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'జైలర్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి వస్తున్న సీక్వెల్ 'జైలర్ 2' పై సరికొత్త ప్రచారం సినీ సర్కిళ్లలో జోరుగా సాగుతోంది. ఈ మోస్ట్ అవేటెడ్ పార్ట్-2లో ఒక పవర్‌ఫుల్ క్యామియో పాత్ర కోసం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌ను రంగంలోకి దించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోందనే వార్త ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కథ ప్రకారం వచ్చే ఒక ప్రత్యేక పాత్ర కోసం దర్శకుడు నెల్సన్ మొదట బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను సంప్రదించారట. అయితే, షారుఖ్ ప్రస్తుతం తన క్రేజీ ప్రాజెక్ట్ 'కింగ్' షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో మేకర్స్ తమ ఫోకస్‌ను హృతిక్ రోషన్‌పైకి మళ్లించారు. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గతంలో వచ్చిన 'జైలర్' మొదటి భాగంలో ముత్తువేల్ పాండియన్ ప్రయాణం ఎక్కడ ముగిసిందో, అక్కడ నుంచే ఈ సీక్వెల్ కథాంశం మొదలుకానుందని టాక్. ఈ సారి కాన్వాస్‌ను మరింత పెద్దదిగా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ భారీ సీక్వెల్‌లో రజనీకాంత్‌తో పాటు మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, ఎస్‌.జె. సూర్య వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే పార్ట్-1లో మెరిసిన మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కూడా ఈ రెండో భాగంలో తమ మ్యాజిక్‌ను రిపీట్ చేయనున్నారట.

మరోవైపు, తలైవా రజనీకాంత్ తన ఫ్యూచర్ లైనప్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో రానున్న 'తలైవర్ 173' ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. ఈ సినిమాకు మొదట సుందర్ సి, ఆ తర్వాత సిబి చక్రవర్తి పేర్లు వినిపించినా.. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా వ‌చ్చిన‌ 'డ్రాగన్' ఫేమ్ అశ్వత్ మరిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

ఇవే కాకుండా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలోనే రజనీకాంత్ - కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కూడా సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ లైనప్ చూస్తుంటే మునుముందు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే సెప్టెంబర్ 11, 2026న 'జైలర్ 2'ను థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హృతిక్ ఎంట్రీ కన్ఫర్మ్ అయితే మాత్రం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం గ్యారెంటీ!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com