Home

»

Latest News

'జైల‌ర్‌2' క్రేజీ అప్‌డేట్‌.. ర‌జినీకాంత్ కోసం రంగంలోకి హృతిక్‌.. చెన్నై షెడ్యూల్ డేట్స్ ఫిక్స్!

Jun 12, 2026 2:09PM

సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ గురించి రోజుకో క్రేజీ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించడంతో ఈ పార్ట్-2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో మొదట బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో ఒక కీలక క్యామియో చేయించాలని మేకర్స్ భావించినప్పటికీ, డేట్స్ కుదరకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ చిత్రంలో హృతిక్ రోషన్ చేయబోయేది చిన్న పాత్రే అయినప్పటికీ, అది కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన హై-వోల్టేజ్ ఎపిసోడ్ అని తెలుస్తోంది. మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ పాత్రలు రజనీకాంత్‌కు క్లిష్ట సమయంలో ఎలాగైతే సహాయపడతాయో, ఈ సీక్వెల్‌లో హృతిక్ క్యారెక్టర్ కూడా ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్)కు ఒక కీలకమైన జంక్షన్‌లో తోడుగా నిలుస్తుందని సమాచారం. ఈ ప్రత్యేక పాత్ర కోసం దర్శకుడు నెల్సన్ నెవర్ బిఫోర్ లుక్‌ను డిజైన్ చేస్తుండగా, షూటింగ్‌కు ముందే హృతిక్‌కు లుక్ టెస్ట్ కూడా నిర్వహించనున్నారు.

ఈ క్రేజీ కాంబినేషన్‌కు ఒక అరుదైన ఫ్లాష్‌బ్యాక్ సెంటిమెంట్ కూడా తోడైంది. దాదాపు 40 ఏళ్ల క్రితం, అంటే 1986లో విడుదలైన 'భగవాన్ దాదా' అనే హిందీ సినిమాలో రజనీకాంత్‌కు పెంపుడు కొడుకుగా బాలనటుడి పాత్రలో చిన్నప్పటి హృతిక్ రోషన్ నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. గతంలో ఒక ఇంటర్వ్యూలో హృతిక్ మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో తాను తప్పులు చేసినా రజనీ సార్ తనపై వేసుకునేవారని, ఆయనెంతో కేరింగ్ అని గుర్తుచేసుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం కోసం రీషూట్లు జరుగుతున్నాయనే ప్రచారంలో నిజం లేదని, కేవలం హృతిక్ రోషన్ కామియో భాగాలను చిత్రీకరించడానికే షెడ్యూల్ ప్లాన్ చేశారని స్పష్టమైంది. జూన్ 22, 23 తేదీలలో చెన్నైలో జరగబోయే ప్రత్యేక షెడ్యూల్‌లో హృతిక్ రోషన్ పాల్గొని తన పోర్షన్స్ పూర్తి చేయనున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ వచ్చే ఆగస్టు నెల సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఇండిపెండెన్స్ డే కానుకగా థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com