నిఖిల్ 'స్పై' మూవీలో 'జై బాలయ్య' సాంగ్!
on Jun 26, 2023

'కార్తికేయ 2' వంటి బ్లాక్ బస్టర్ తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'స్పై'. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకుడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 29 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఉన్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ పై నిఖిల్ ప్రత్యేక అభిమానం చూపిస్తూ ఉంటాడు. గతంలో 'కిరాక్ పార్టీ' సినిమాలో బాలయ్య అభిమానిగా కనిపించాడు. ఇక ఇప్పుడు 'స్పై'లోనూ బాలయ్య ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడట. స్పై సినిమాలోని ఒక కీలక పాత్రధారి బాలయ్య అభిమానిగా కనిపిస్తారట. ఇందులో బాలయ్యకి సంబంధించిన పలు రిఫరెన్స్ లు ఉంటాయని, ముఖ్యంగా 'జై బాలయ్య' బిట్ సాంగ్ ఉంటుందని ఇన్ సైడ్ టాక్. అదే నిజమైతే ఇది బాలయ్య ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



