
టైగర్ ష్రఫ్ పై హత్యాయత్నం జరిగిన నాటి నుంచి టైగర్ తండ్రి పాన్ ఇండియా అగ్ర నటుడు జాకీ ష్రఫ్ కూడా డైలీ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా జైలర్ 2 తో తన కట్ ఫుట్ కెపాసిటీ తెలియచేసాడు
నేడు ప్రముఖ అగ్ర నటి టబు బర్త్ డే . ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, కోట్లాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో జాకీ ష్రాఫ్ చేసిన ఒక ప్రత్యేక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో టబుతో కలిసి దిగిన రేర్ త్రోబ్యాక్ ఫొటోను జాకీ ష్రాఫ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. సిల్వర్ రంగు దుస్తుల్లో ఎంతో హుందాగా, అందంగా కనిపిస్తున్న టబుతో కూడిన ఆ చిత్రానికి "హ్యాపీనెస్ ఆల్వేస్" (ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి) అనే క్యాప్షన్ జతచేశాడు.
ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్, షారుఖ్ ఖాన్: రెండో ప్రపంచ యుద్దానికి సంబంధం ఏంటి!

అంతేకాకుండా, 1999లో వచ్చిన టబు సూపర్ హిట్ చిత్రం 'తక్షక్' సినిమాలోని మధురమైన 'బూందోన్ సే బాతే' పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా జోడించి ఈ బర్త్ డే విషెస్‌ను మరింత భావోద్వేగభరితంగా మార్చారు. జాకీ ష్రాఫ్, టబు గతంలో '2001: దో హజార్ ఏక్', 'కోహ్రామ్' వంటి పలు చిత్రాల్లో స్క్రీన్‌ను పంచుకున్నారనే విషయం తెలిసిందే.
[jackie Shroff birthday Wishes To Tabu, Tabu 55th birthday, Jackie Shroff wishes, Tabu birthday news, Bollywood actress Tabu, Tabu movies, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]






