Home

»

Latest News

ఐదు సినిమాలూ... హాం ఫ‌ట్

Oct 22, 2016 12:28PM

ఒకే వారం బాక్సాఫీసు ముందుకు అయిదు సినిమాలొస్తే.. ఆ హంగామానే వేరుగా ఉంటుంది. ఈసారి బాక్సాఫీసు ద‌గ్గ‌ర అలాంటి సంద‌డే క‌నిపించింది. ఇజం, శంక‌ర‌, నందిని న‌ర్సింగ్ హోమ్‌, త‌ను వ‌చ్చెనంట‌, ఎల్ 7 సినిమాలు వ‌రుస క‌ట్టేశాయి. క‌నీసం ఇందులో ఓ రెండు సినిమాలు ఆడినా.. ఈ వారాంతం టాలీవుడ్ హుషారుగా న‌డిచిపోయేది. కానీ...  నిరాశా జ‌న‌క‌మైన ఫ‌లితాల‌తో  ఉస్సూరు మ‌నిపిస్తున్నాయి. 5 సినిమ‌లొచ్చినా దేనికీ వ‌సూళ్లు లేక‌పోవ‌డం టాలీవుడ్‌ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఎన్నో న‌మ్మ‌కాలు పెట్టుకొన్న ఇజం బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఘోరంగా దెబ్బ‌తింది. ఈ సినిమాకి 60 నుంచి 75 శాతం వ‌ర‌కూ వ‌సూళ్లు అందాయంతే. హోస్ ఫుల్ బోర్డు ఒక్క‌టీ క‌నిపించ‌లేదు. తొలిరోజే ప‌రిస్థితి ఇలా ఉంటే.. ప‌రిస్థితి అర్థం చేసుకోవొచ్చు. నందిని న‌ర్సింగ్ హోమ్‌కి టాక్ బాగానే ఉన్నా.. థియేట‌ర్లో జ‌నం క‌ర‌వ‌య్యారు. నారా రోహిత్ శంకర‌కీ బ్యాడ్ టాక్ వ‌చ్చింది. క‌నీసం 30 శాతం టికెట్లు కూడా తెగ‌లేద‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల రిపోర్ట్‌. త‌ను వ‌చ్చెనంట‌, ఎల్ 7 సినిమాలు వ‌చ్చాయ‌న్న సంగ‌తి కూడా ఆడియ‌న్స్‌కి తెలీదు. ఇక వాటి బాక్సాఫీసు ఫలితం గురించి ప‌ట్టించుకోవ‌డం అన‌వ‌స‌రం. అలా.. ఈవారం వ‌చ్చిన 5 సినిమాలూ తీవ్ర నిరాశ‌ని క‌లిగించాయి. వ‌చ్చేవారం కూడా సినిమాల సందడి ఎక్కువ‌గానే క‌నిపించ‌బోతోంది. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com