Home

»

news

Prabhas: ప్రభాస్ గురించి వినిపిస్తున్న ఆ షాకింగ్ న్యూస్ నిజమేనా?

Feb 19, 2026

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన న్యూస్
ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడా?
ఆ వార్తల్లో నిజమెంత?

ఈ ఏడాది సంక్రాంతికి 'ది రాజా సాబ్'తో నిరాశపరిచిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas).. తన తదుపరి సినిమాలతో బాక్సాఫీస్ కి తన పవర్ ఏంటో చూపించాలి అనుకుంటున్నారు. ప్రస్తుతం 'ఫౌజి', 'స్పిరిట్', 'కల్కి-2' వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. 'సలార్-2' కూడా చేసే అవకాశముంది. ఇలాంటి తరుణంలో ఒక ఊహించని న్యూస్ తెరపైకి వచ్చింది.

ప్రభాస్ తో 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. రీసెంట్ గా ఆ వార్తలు మరింత ఊపందుకున్నాయి. ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో మూవీ ఖచ్చితంగా ఉంటుందని సమాచారం.  ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తయిన తరువాత.. ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వినికిడి. ఈ లోపు ప్రశాంత్ కూడా 'జై హనుమాన్' పూర్తి చేయాల్సి ఉంది. 

ప్రభాస్ తో సినిమా ఉండటం ప్రశాంత్ వర్మకు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తనవి రెండు ప్రాజెక్ట్ లు ఆగిపోయాయి. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో తలపెట్టిన 'బ్రహ్మ రాక్షస' ఆగిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కూడా ఎందుకనో పట్టాలెక్కలేదు.

ఆ రెండు సినిమాల బాటలోనే ప్రభాస్ ప్రాజెక్ట్ కూడా అటకెక్కినట్లే అని వార్తలొచ్చాయి. వరుసగా మూడో ప్రాజెక్ట్ ఆగిపోవడం అనేది ఏ దర్శకుడికైనా దెబ్బే. దీంతో ప్రశాంత్ వర్మ సినీ కెరీర్ పై తీవ్ర ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రభాస్ ప్రాజెక్ట్ ఆగిపోలేదనే తాజా వార్త.. ప్రశాంత్ వర్మకు ఎంతో ఊరట అని చెప్పవచ్చు.

'హనుమాన్' బాటలోనే 'జై హనుమాన్'తో మరో హిట్ కొట్టి.. ఆ తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ తో మ్యాజిక్ చేస్తే.. ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయినట్లే.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com