కీరవాణికి తప్పని ఫ్లాప్స్!
on Oct 18, 2021
ఇండియన్ బాక్సాఫీస్ నే శాసించిన `బాహుబలి - ది కంక్లూజన్`కి సంగీతమందించిన ఘనత స్వరవాణి కీరవాణిది. అలాంటి కీరవాణి ఫిల్మోగ్రఫీని గమనిస్తే ఓ విషయం స్పష్టం. అదేమిటంటే.. 90ల్లో తిరుగులేని సంగీత దర్శకుడిగా రాణించిన కీరవాణికి గత ఒకటిన్నర దశాబ్దంలో దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు తప్ప మరే చిత్రాలు విజయాన్ని అందించలేకపోతున్నాయి. మరీముఖ్యంగా.. `శ్రీరామదాసు` (2006) అనంతరం కీరవాణి బాణీలు అందించిన రాజమౌళేతర చిత్రాలన్నీ నిరాశపరిచాయి. వీటిలో `బద్రినాథ్`, `దమ్ము` లాంటి బిగ్ టికెట్ ఫిల్మ్స్ సైతం ఉండడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఈ విజయదశమి సీజన్ లో కీరవాణి స్వరకల్పనలో రూపొందిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ ముందు నిలిచాయి. ఆ సినిమాలే.. `కొండ పొలం`, `పెళ్ళి సందD`. అక్టోబర్ 8న విడుదలైన క్రిష్ డైరెక్టోరియల్ `కొండ పొలం` విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ టికెట్ విండోస్ వద్ద నిరాశపరిచింది. ఇక అక్టోబర్ 15న రిలీజైన గౌరీ రోణంకి డైరెక్టోరియల్ `పెళ్ళి సందD` డిజాస్టర్ టాక్ తో నడుస్తోంది. మొత్తమ్మీద.. రాజమౌళేతర చిత్రాలతో కీరవాణికి మరోసారి ఫ్లాప్స్ తప్పలేదన్నమాట. మరి.. `హరిహర వీరమల్లు`తోనైనా రాజమౌళి సారథ్యంలేని విజయం కీరవాణి వశమవుతుందేమో చూడాలి.
Also Read