Home

»

Latest News

ఇరుముడి ట్రైలర్: 'విల్లాలి వీరుడు' అంటూ రవితేజ విశ్వరూపం.. బ్లాక్‌బస్టర్ ఖాయం.! 

Aug 12, 2026 6:29PM

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు 21న థియేటర్లలో అడుగుపెట్టనుంది. 

'ఇరుముడి'పై మొదటి నుంచి ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ మెప్పించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది.

ట్రైలర్ ప్రారంభంలో ఒక పల్లెటూరి వాతావరణం, సాధారణమైన జీవితాన్ని గడిపే ఒక తండ్రి, ఆయన ప్రాణంగా ప్రేమించే కూతురు కనిపిస్తారు. "నా కూతురిని హైస్కూల్‌కి పంపాలంటే మన ఊరికి బస్సైనా రావాలి, లేదా ఇక్కడికే హైస్కూల్ రావాలి" అని రవితేజ చెప్పే డైలాగ్... గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లల చదువు కోసం తండ్రులు పడే వేదనను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

అయితే కథ అంతా హ్యాపీగా సాగిపోతున్న సమయంలో ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ ఊరి ఆడపిల్లల భద్రతకు, చదువుకు అడ్డంకిగా మారిన కొన్ని సంఘటనలు.. రవితేజ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఆడపిల్లల జోలికి వచ్చేవారికి బుద్ధి చెప్పే వ్యక్తిగా రవితేజ పాత్ర కనిపిస్తోంది. ముఖ్యంగా "నాకో బలహీనత ఉంది. ఏ ఆడ కూతురిలోనైనా నా కూతురిని చూసుకునే అరుదైన బలహీనత." అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ కథలోని లోతుని తెలియజేస్తుంది.

రవితేజ త్రినాథ్ అనే సాధారణ వ్యక్తి పాత్రలో ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంది. అయ్యప్ప దీక్ష చేపట్టే 41 రోజులు తప్ప, మిగతా రోజులన్నీ మద్యం ప్రియుడిలా ఆయన పాత్ర కనిపిస్తోంది. అలా అని చెడ్డవాడు కాదు. కూతురంటే ప్రాణం ఇస్తాడు. ఏ ఆడపిల్లకు కష్టమొచ్చినా ఒక తండ్రిలా అండగా నిలబడతాడు. ఇక ట్రైలర్ చివర్లో అయ్యప్ప స్వామి మాల ధరించి రవితేజ కనిపించిన సీన్స్ హైలైట్ గా నిలిచాయి. 

దర్శకుడు శివ నిర్వాణ అంటేనే మనకు ఎమోషన్స్, మంచి ఫ్యామిలీ డ్రామా గుర్తుకొస్తాయి. ఈసారి ఆయన రవితేజలోని యాక్షన్ యాంగిల్‌ను, ఒక తండ్రి ఆవేదనతో మిక్స్ చేసి అద్భుతంగా తెరకెక్కించారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌కి ప్రాణం పోసింది. ముఖ్యంగా 'విల్లాలి వీరుడు' బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్ లోని ప్రతీ ఫ్రేమ్‌లో ఎమోషన్ అండ్ ఇంటెన్సిటీ స్పష్టంగా కనిపిస్తోంది.

 

 

 

Irumudi Trailer, Ravi Teja, Shiva Nirvana, Mythri Movie Makers

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com