Home

»

Latest News

సరికొత్త వివాదంలో ఇరుముడి.. ఆ టైటిల్ పెట్టచ్చుగా అంటున్న ఆ దేవుడి భక్తులు

Aug 13, 2026 5:42PM

 

 

అభిమానుల హోరు మధ్య నిన్న 'ఇరుముడి' ట్రైలర్ వచ్చిన విషయం తెలిసిందే. అలా రిలీజ్ అయ్యిందో లేదో, సోషల్ మీడియాలో మాస్ మహారాజా అభిమానుల హంగామా మాములుగా లేదు. హిట్ పక్కా, రికార్డులే తరువాయి అంటూ కామెంట్స్ తో సోషల్ మీడియాలో సందడి వాతావరణం తీసుకొస్తున్నారు. కానీ అదే టైంలో ఇరుముడి టైటిల్ పై జరుగుతున్న చర్చ వైరల్ గా మారింది.

ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడూతు 'ఇరుముడి కేవలం ఒక ఆధ్యాత్మిక లేదా భక్తి కథ మాత్రమే కాదు. ఒక తండ్రి తన జీవితంలో ఎదుర్కొనే సంఘర్షణ, అయ్యప్ప భక్తుడి విశ్వాసం, గ్రామంలో జరిగే క్రైమ్ మిస్టరీ అనే మూడు  కీలకమైన విభిన్న కోణాల్ని మూవీలో చూపించాం. కథలోని ఈ మూడంశాలను కలిపే ఒక బలమైన భావనగా 'ఇరుముడి' అనే పవిత్రమైన టైటిల్ ని ఎంచుకున్నామని చెప్పుకొచ్చాడు. అయితే, ఈ వివరణపై స్వామి అయ్యప్ప భక్తులు  అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 


Also read: Toxic: యష్ ని మా రాష్ట్రంలో ఉండనివ్వం.. టాక్సిక్ పై ప్రముఖ నటి ఆగ్రహం


శబరిమల యాత్ర చేసే భక్తులు 41 రోజుల కఠినమైన దీక్ష సమయంలో ఎంతో పవిత్రంగా భావించి నెత్తిన మోసే 'ఇరుముడి' పేరును, క్రైమ్ మిస్టరీ, నెగెటివ్ ఛాయలున్న కథాంశానికి ఎందుకు వాడారని ప్రశ్నిస్తున్నారు. సినిమాలో తండ్రీకూతుళ్ల అనుబంధం, ఆధ్యాత్మికత, క్రైమ్ మిస్టరీ అనే 3 విభిన్న కోణాలు ఉన్నాయని స్వయంగా దర్శకుడే చెప్తున్నప్పుడు, సినిమాకి 'త్రిముడి' అనే మరో పేరుని ఎన్నుకోవచ్చు కదా!  అత్యంత నిష్ఠతో కూడిన ఇరుముడి శబ్ద ప్రాశస్త్యాన్ని ఇలాంటి క్రైమ్ నేపథ్యం ఉన్న చిత్రానికి ఉపయోగించడం శబరిమల భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 21న సినిమా విడుదల తేది దగ్గరపడుతున్న తరుణంలో ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. పాన్ ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన విషయం తెలిసిందే. 

Irumudi, Ravi Teja, Priya Bhavani Shankar, Shiva Nirvana

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com