Home

»

Latest News

సంచలన వార్త: ఇరుముడి మూవీ బ్రిడ్జ్ కూల్చివేత..ఇది అతని పనేనా!

Sep 30, 2026 10:34AM

 

 

ఇరుముడి సినిమా సాధించిన ఘన విజయం వెనక కథకి, సన్నివేశాలకి తగ్గ లొకేషన్స్. దీంతో ప్రేక్షకులు థియేటర్స్ లో ఉన్నంతసేపు  ఇరుముడితో కనెక్ట్ అయిపోయారు. ప్రకృతి రమణీయతకి  నిలయమైన ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని  పొల్లూరులో షూటింగ్ జరిగింది. 

ఆ ఏరియాలో ‘ఇరుముడి’చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా నిర్మాణం చేసిన సెట్టింగ్ బ్రిడ్జి కొండవాగుల వరద తాకిడికి పూర్తిగా కుప్పకూలి కొట్టుకుపోయింది. గడిచిన కొద్ది రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి కొండవాగులు, వంకల ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో పొల్లూరు జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ప్రవాహ ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో జలపాత ప్రాంగణంలో నదిపై ఏర్పాటు చేసిన  రంగురంగుల ఐకానిక్ బ్రిడ్జి,నీటి హోరుకి తట్టుకోలేక క్షణాల్లో కొట్టుకుపోయిందని స్థానికులు వెల్లడించారు. ఇరుముడి’ ఘన విజయం సాధించిన తర్వాత పొల్లూరు ప్రాంత పర్యాటక రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. గతంలో రోజువారీగా కేవలం వందల సంఖ్యలోనే పర్యాటకులు వచ్చే ఈ ప్రదేశానికి, సినిమా విడుదలైన నాటి నుంచి సందర్శకుల ప్రవాహం విపరీతంగా పెరిగింది.


 సాధారణ రోజుల్లో వేలాది మంది వస్తుండగా, ముఖ్యంగా వారాంతాలు మరియు సెలవు రోజుల్లో కనీసం 5,000 నుండి 10,000 మంది వరకు పర్యాటకులు ఈ జలపాతాన్ని సందర్శించేందుకు క్యూ కడుతున్నారు. సినిమాలో హీరో రవితేజ మరియు ఇతర నటీనటులు నటించిన ప్రదేశాలను ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించేందుకు పర్యాటకులు, అభిమానులు విశేష ఆసక్తి కనబరుస్తున్నారు.   ఈ పర్యాటక ఆకర్షణలో అత్యంత ప్రత్యేకమైన భాగం సినిమా సెట్ కోసం వేసిన ప్రత్యేక వంతెన. జలపాతం ఉరుకులు పరుగుల మధ్య తీసిన దృశ్యాలను గుర్తుచేసుకుంటూ, పర్యాటకులు ఈ బ్రిడ్జిపై నిలబడి సెల్ఫీలు, రీల్స్, ఫోటోలు తీసుకోవడానికి గంటల తరబడి వేచి చూసేవారు. పర్యాటకులకు ఇది ఒక ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా మారింది. అయితే ఇప్పుడు ఈ వంతెన నీటిపాలవ్వడంతో అక్కడికి వస్తున్న పర్యాటకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

 ప్రస్తుతం పొల్లూరు వద్ద వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పర్యాటక ప్రేమికులు, సందర్శకులు జలపాతం వద్దకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. నదీ ప్రవాహంలోకి ఎవరూ దిగవద్దని, సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే ఉండాలని స్థానిక పోలీసులు మరియు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అందుకే అంటారు  ప్రళయం కూడా ఒక మహోజ్వల రూపుడని, అతని  ముందు ఏది శాశ్వతం కాదని.

 

 

Irumudi Movie Bridge Collapses Polluru Waterfalls, Irumudi, Raviteja, Polluru, Priya Bhavani Shankar, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com