
మాస్ మహారాజా రవితేజ శివ, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో వచ్చిన ఇరుముడి సాధించిన విజయం తెలిసిందే. హరిహరసుతుడు కలియుగ దైవం అయ్యప్ప స్వామి దీక్షని, స్వామి పరమార్దాన్ని ఆత్మగా చేసుకొని వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా 20 రోజుల పాటు రోజుకి కోటి రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు సాధించిన ఘనత కూడా కేవలం ఇరుముడికే సాధ్యమైంది.
ఈ భారీ విజయం అందించిన ఉత్సాహంతో, చిత్ర దర్శకుడు శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్ భక్తి మార్గంలో అడుగుపెట్టారు.ఆ ఇద్దరు తాజాగా అయ్యప్ప దీక్షని స్వీకరించారు. హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో వీరు ఇద్దరూ అత్యంత భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాలను ధరించి దీక్షను ప్రారంభించారు.

ప్రతి ఏడాది శీతాకాలం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప నామస్మరణతో పాటు, నల్లటి దీక్ష వస్త్రాలు ధరించి స్వామి భక్తులు పంబానది ప్రయాణానికి సిద్ధమవుతుంటారు. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’ చిత్రంలో స్వామివారి భక్తి తత్వాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు,నిర్మాత నేడు స్వయంగా దీక్షాధరులు కావడం సినీ వర్గాల్లో మరియు అభిమానులలో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలోని సెంటిమెంట్ కేవలం వెండితెర మీదే కాకుండా, నిజ జీవితంలోనూ ప్రతిఫలించడం విశేషం.
ఇది కూడా చదవండి:ధనుష్ ఓం ఫస్ట్ రివ్యూ!..700 టన్నుల ఎర్రచందనం మాయమైతే ఏమైంది?
దీంతో చిత్ర యూనిట్ సభ్యులు ఇలా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార ఫస్ట్ రివ్యూ ఇదే!
మీకు నచ్చవచ్చు:ENE రిపీట్ ఫస్ట్ రివ్యూ ఇదే!
[Irumudi, Shiva Niravana, Ravishankar, Raviteja, Tollywood]





