Home

»

Latest News

ప్రముఖ అగ్ర దర్శకుడి కుమార్తె ఇదా అలీ పెళ్లి: వరుడు క్రిష్ అగర్వాల్ 

Sep 23, 2026 3:27PM

 

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ ఇంట్లో ప్రస్తుతం పెళ్లి బాజాలు మోగేందుకు వేళయైంది. 'లవ్ ఆజ్ కల్', 'రాక్‌స్టార్', 'హైవే' వంటి మైలురాయిలాంటి ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ దిగ్గజ దర్శకుడు, ఇప్పుడు తన నిజ జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణాలని  ఆస్వాదిస్తున్నాడు . ఆయన కుమార్తె 'ఇదా అలీ' త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన సుదీర్ఘకాల ప్రేమికుడు క్రిష్ అగర్వాల్‌తో ఇదా అలీకి ఇటీవల నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ శుభవార్తని  స్వయంగా ఇంతియాజ్ అలీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకోవడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ జంట ఫొటోలు వైరల్‌గా మారాయి. "మీ అందరి ఆశీస్సులు, ప్రేమాభిమానాలు మా కొత్త జంటపై ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ కాబోయే వధూవరుల అందమైన నిశ్చితార్థ చిత్రాన్ని షేర్ చేస్తూ ఇంతియాజ్ అలీ భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ నిశ్చితార్థ వేడుకలో ఇదా అలీ బేబీ పింక్ కలర్ డిజైనర్ చీరలో దేవకన్యలా మెరిసిపోగా, క్రిష్ అగర్వాల్ నలుపు రంగు రాయల్ షేర్వాణీలో ఎంతో హుందాగా కనిపించారు. ఒకరికొకరు ఎంగేజ్‌మెంట్ రింగ్స్ తొడిగే సమయాన వారి ముఖాల్లో కనిపించిన ఆనందం అందరినీ ఆకట్టుకుంది. ఈ నిశ్చితార్థ ప్రయాణం ఎంతో ఫిల్మీగా, రోమాంటిక్‌గా సాగడం విశేషం. ఈ ఏడాది జూలై 1వ తేదీన నార్వేలోని మంచుతో కప్పబడిన వైట్రెస్సాండ్ (Ytresand) అందమైన బీచ్ పరిసరాల్లో క్రిష్ అగర్వాల్ మోకాళ్లపై కూర్చుని ఇదాకు డ్రీమీ ప్రపోజల్ చేశారు. ఆ తర్వాత జూలై 12న ఇదా ఈ ప్రపోజల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దానికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అంతకంటే ముందే, ఇదాకు ప్రపోజ్ చేయడానికి ప్రణాళిక వేసుకున్న క్రిష్, స్వయంగా ఇంతియాజ్ అలీని కలసి తన మనసులోని మాట చెప్పి పెద్దల అనుమతి తీసుకోవడం దర్శకుడికి ఎంతో నచ్చింది. ఒక తండ్రిగా ఇది తన జీవితంలోనే అతిపెద్ద సంతోషకరమైన ఘట్టమని ఇంతియాజ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 

 

 

ఇది కూడా చదవండి: చరణ్, సుకుమార్ మూవీ పూజా కార్యక్రమం డేట్ వచ్చేసింది: ఆ డేట్ స్పెషల్ ఇదే  

కార్పొరేట్ ఫైనాన్స్ మరియు సినీ సృజనాత్మక రంగాల అరుదైన కలయికగా ఈ జంట నిలిచింది. 24 ఏళ్ల క్రిష్ అగర్వాల్ ఫైనాన్స్ రంగానికి చెందిన ప్రొఫెషనల్ కాగా, క్వాంటిటేటివ్ రీసెర్చర్‌గా స్థిరపడ్డారు. మరోవైపు ఇదా అలీ తండ్రి బాటలోనే సినీ పరిశ్రమలో తన ముద్ర వేస్తోంది. కేవలం 17 ఏళ్ల పిన్న వయస్సులోనే 'లిఫ్ట్' అనే షార్ట్ ఫిలిం తీసి తన ప్రతిభను చాటుకున్న ఇదా, ఆ తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న చాప్‌మన్ యూనివర్సిటీ డాడ్జ్ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా ఆర్ట్స్ నుంచి డైరెక్షన్‌లో పట్టా పుచ్చుకుంది. ఆ తర్వాత ఆమె 'మాయ', 'ఉల్జే హుయే' వంటి ప్రాజెక్ట్‌లకు రచయిత్రిగా, దర్శకురాలిగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా, ఇటీవల రూ. 70 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై ప్రపంచవ్యాప్తంగా 99 కోట్ల వసూళ్లను రాబట్టిన ఇంతియాజ్ అలీ చిత్రం 'మై వాపస్ ఆవుంగా' సాధించిన విజయంతో కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. సినీ ప్రియులు, నెటిజన్లు, బాలీవుడ్ ప్రముఖులు ఈ నూతన జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

 

Imtiaz Ali Daughter Ida Ali Engaged, Imtiaz Ali, Bollywood engagement updates, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com