Home

»

Latest News

నా కెరీర్ ఇంకా ముగిసిపోలేదంటున్న ఇలియానా

Mar 27, 2016 1:19PM

నడుము సుందరి ఇలియానాకు ఇప్పుడు తెలుగులో అవకాశాలేం లేవు. ఒకప్పుడు టాలీవుడ్ లో వరస ప్రాజెక్ట్స్ తో కుమ్మేసిన ఈ భామ, ఇప్పుడు అవకాశాల్లేక గోవాలో గోళ్లు గిల్లుకుంటోంది. బాలీవుడ్ లో రెండు అవకాశాలు రాగానే, టాలీవుడ్ గురించి పిచ్చి కూతలు కూసి స్వయంగా కెరీర్ కు ఎర్త్ పెట్టేసుకుంది. ప్రస్తుతం ట్విట్టర్లో డబుల్ మీనింగ్ ట్వీట్లతో, ఎలాగోలా న్యూస్ లో ఉండే ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో యాక్ట్ చేసిన రుస్తుం ఒక్కటే ఈ భామకు ఇప్పట్లో ఉన్న రిలీజ్. చేతిలో కూడా ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. రుస్తుం ప్రమోషన్లో ఉన్నప్పుడు, మీ కెరీర్ ప్లాన్ ఏంటి అని విలేకరి అడిగిన క్వశ్చన్ కు, నా కెరీర్ ఇంకా ముగిసిపోలేదు. రుస్తుం తర్వాత కూడా ఇక్కడే ఉంటా అంటూ సెలవిచ్చింది. అవకాశాలేమీ లేకుండా, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో, ఇల్లీ బేబీకే తెలియాలి మరి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com