
అల్లు అర్జున్ హీరోగా "ఇద్దరమ్మాయిలతో" అనే డిజాస్టర్ సినిమా తెరకెక్కించిన పూరీ జగన్నాధ్ ఇప్పుడు "ఇద్దరబ్బాయిలతో" ఒక సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నాడు. అతి తక్కువ సమయంలో సినిమాలను పూర్తి చేసి విడుదల చేస్తుంటాడు పూరీ. ప్రస్తుతం కల్యాణ్ రామ్ తో 'ఇజం' సినిమాను రూపొందిస్తోన్న ఆయన తన తదుపరి చిత్రం మహేష్ బాబు తో చేయాల్సి వుంది. ఈ చిత్రానికి 'జనగణమన' అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే మహేష్ మురుగదాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తనకు కొత్త సినిమా చేయడానికి సమయం పడుతుంది. దీంతో ఆ గ్యాప్ ను పూర్తి చేయడానికి పూరీ జగన్నాథ్ ఓ మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అందులో ఒక హీరో నాగశౌర్య కాగా మరొక హీరోగా "పెళ్ళిచూపులు" చిత్రంతో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొన్న విజయ్ దేవరకొండను ఎన్నుకొన్నాడని టాక్. మరి గ్యాప్ ఫిల్ చేయడం కోసం పూరీ తీయాలనుకొంటున్న ఈ యంగ్ హీరోల మల్టీస్టారర్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే.. ప్రస్తుతం ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించాల్సిన ముద్దుగుమ్మల కోసం అన్వేషిస్తున్నాడు పూరీ!






