షాకింగ్ కండీషన్స్‌తో ఐ బొమ్మ రవికి బెయిల్ మంజూరు!
on Feb 17, 2026
గత కొన్ని సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమకు చుక్కలు చూపిస్తున్న ఐ బొమ్మ రవిని ఎట్టకేలకు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది. రవికి బెయిల్ వస్తుందా, రాదా సందేహం కూడా చాలా మందిలో ఉంది. అయితే తాజాగా కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. సాధారణంగా బెయిల్ ఇచ్చిన తర్వాత కొన్ని షరతులు విధిస్తారు. అయితే రవి విషయంలో కోర్టు పెట్టిన కఠినమైన కండీషన్స్ అందర్నీ షాక్‌కి గురి చేస్తున్నాయి.
ఇకపై పైరసీకి సంబంధించిన ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదని కోర్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా అతను ఇంటర్నెట్ ఉపయోగించే విషయంలో పూర్తి స్థాయి ఆంక్షలు విధించింది. ఏ నెట్వర్క్ ఇంటర్నెట్‌ని కూడా రవి వాడకూడదని, అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సి వస్తే ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.
రవి దేశాన్ని విడిచి వెళ్ళకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళకూడదని కోర్టు ఆదేశించింది. అందులో భాగంగానే తన పాస్‌పోర్ట్‌ను కోర్టుకి సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సినిమాలను పైరసీ చేయడం ద్వారా చిత్ర పరిశ్రమకు కొన్ని వేల కోట్లు నష్టాన్ని చేకూర్చిన రవి.. మళ్లీ తరహా కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు లేకుండా ఇలాంటి అరుదైన షరతులు విధించింది కోర్టు. ఇప్పటివరకు తను నిర్వహిస్తూ వచ్చిన వెబ్‌సైట్‌ను ఉపయోగించే వీలు లేకుండా ఇంటర్నెట్కి సంబంధించిన పలు చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



