
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన సాహూ, కల్కి 2898 ad చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న భామ దిశా పటానీ. బాలీవుడ్ లో హిట్ ట్రాక్ తో దూసుకుపోతూ ఉంది. ఇక గ్లామర్ ప్రపంచంలో నిత్యం ట్రెండింగ్‌లో ఉండే హీరోయిన్స్ లో సైతం దిశా పటానీ పేరు ముందు వరుసలో ఉంటుంది. సోషల్ మీడియాలో తను షేర్ చేసే హాట్ అండ్ గ్లామరస్ ఫోటోషూట్స్ చూసి చాలా మంది ఆమె గ్లామర్ ప్రదర్శనకి ఎలాంటి మొహమాటపడని భామగా భావిస్తుంటారు.
తెరపై ఎంతటి గ్లామరస్ క్యారక్టర్ లో కనిపించినా, నిజ జీవితంలోనూ ఆమె అలాగే ఉంటుందని, నిత్యం పార్టీలు, పబ్బ్లు, హ్యాంగౌవర్లతో కాలం గడుపుతుంటుందని సాధారణ జనాలతో పాటు నెటిజన్లు గట్టిగా నమ్ముతుంటారు. కానీ, తాజాగా ఈ బ్యూటీ తన గురించి బయట ప్రచారంలో ఉన్న ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ ఒక ఆసక్తికరమైన క్లారిటీ ఇచ్చింది. తాను బయట అనుకుంటున్నట్టుగా పార్టీలు తిరిగే రకం కాదని కుండబద్దలు కొట్టింది. నిజ జీవితంలో చాలా రిజర్వ్డ్గా ఉంటానని, ఎవరితోను త్వరగా కలవలేను. సోషల్ మీడియాలో కనిపించే తన ఇమేజ్‌కి, అసలు సిసలైన తన నిజ జీవిత స్వభావానికి చాలా వ్యత్యాసం ఉందని ఆమె వెల్లడించింది. బయట ప్రజలు తనను ఒక పార్టీ లవర్‌గా లేదా పబ్ కల్చర్‌కు అలవాటు పడిన అమ్మాయిగా భావిస్తారని, కానీ ఆ అంచనాలన్నీ పూర్తిగా తప్పని ఆమె తేల్చిచెప్పింది. తనకు రాత్రింబవళ్లు పార్టీలు చేసుకోవడం, జనంతో కలిసి ఎంజాయ్ చేయడం లాంటి హాబీలు అసలే లేవని, ఖాళీ సమయం దొరికితే ఇంట్లోనే ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతానని ఆమె చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: రిలీజ్ కి ముందే రామాయణకి పైరసీ సెగ: బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ!

వెండితెరపై కనిపించే పాత్రలు కేవలం నటనలో భాగమని, వాటిని వ్యక్తిగత జీవితానికి ఆపాదించడం సరికాదని దిశా పటానీ అభిప్రాయపడింది. తన వృత్తిపరమైన బాధ్యతల్లో భాగంగా గ్లామర్ పాత్రలు పోషిస్తున్నప్పటికీ, పర్సనల్ లైఫ్‌లో మాత్రం తాను పూర్తిగా వేరేలా ఉంటానని ఆమె పేర్కొంది. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా పుస్తకాలు చదువుకోవడం, జిమ్‌లో కఠినమైన వర్కవుట్లు చేయడం, తన పెంపుడు జంతువులతో సమయం గడపడం అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని ఆమె తెలిపింది. ఈ వ్యాఖ్యలతో ఇప్పటివరకు ఆమెపై ఉన్న ముద్ర పూర్తిగా మారిపోవడంతో, ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హాట్ టాపిక్‌గా మారాయి.
[I Am Not A Party Type Girl Disha Patani, Disha Patani latest Comments, disha patani, disha patani news, disha patani party type, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]






