Home

»

Latest News

రామ్‌ 'హైపర్‌' ఫస్ట్‌ లుక్‌ 

Aug 3, 2016 7:55AM

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు) టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఆగస్ట్‌ 5 నుండి వైజాగ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్‌ జరుగుతుంది. ఆగస్ట్‌ 20 వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో టోటల్‌ టాకీ పార్ట్‌ పూర్తవుతుంది. సెప్టెంబర్‌ 9కి పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. సెప్టెంబర్‌ రెండో వారంలోనే ఆడియో రిలీజ్‌ చేసి సెప్టెంబర్‌ 30న విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు. 

దర్శకుడు సంతోష్‌ శ్రీన్‌వాస్‌ మాట్లాడుతూ - ''హైపర్‌ అనే టైటిల్‌ రామ్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ సూట్‌ అవుతుంది. సినిమాలోని క్యారెక్టర్‌ కూడా అతని ఎనర్జీకి తగ్గట్టుగానే పవర్‌ఫుల్‌గా వుంటుంది. యాక్షన్‌తోపాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఈ చిత్రంలో వుంటుంది. ఒక మంచి ఎనర్జీ వున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌'' అన్నారు. 

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com