.jpg)
'రిపబ్లిక్' ప్రీ-రిలీజ్ వేడుకలో ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి పేర్ని నాని మీద ప్రముఖ కథానాయకుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. జగన్ అభిమానిగా నటుడు పోసాని కృష్ణమురళి లైనులోకి వచ్చారు. ముందు పవన్ మీద వ్యక్తిగత దాడి చేశారు. ఆ తర్వాత బూతు పురాణం మొదలుపెట్టారు. వీళ్లిద్దరి మధ్యలోకి 'హైపర్' ఆది వచ్చాడు. నిజానికి, అతడు రాలేదు. ఫేక్ ట్విట్టర్ అకౌంట్ వల్ల రావాల్సి వచ్చింది.
పవన్‌కు 'హైపర్' ఆది ఫ్యాన్. గతం పవన్‌ను టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ విమర్శలు చేసినప్పుడు స్కిట్స్‌లో కత్తి మీద హైపర్ పంచ్ డైలాగ్స్, సెటైర్స్ వేశారు. ఇప్పుడు ట్విట్టర్ ద్వారా పోసాని మీద హైపర్ ఆది విమర్శలు చేసినట్టు వార్తలొచ్చాయి. పవన్ అభిమానిగా స్పందించాడని చాలామంది భావించారు. అసలు నిజం ఏమిటంటే... ఆ ట్విట్టర్ అకౌంట్ 'హైపర్' ఆదికి కాదు. అతడి పేరు మీద ఎవరో ఓపెన్ చేసిన ఫేక్ అకౌంట్. ఇదే విషయం చెబుతూ ఆది ఒక వీడియో విడుదల చేశారు.
తనకు ఫేస్బుక్ అకౌంట్ తప్ప ట్విట్టర్లో అకౌంట్ లేదని 'హైపర్' ఆది స్పష్టం చేశారు. తన పేరు ఉన్నది ఫేక్ ట్విట్టర్ అకౌంట్ అని చెప్పారు. ఒకవేళ తాను ఏదైనా చెప్పాలని అనుకుంటే లైవ్ వీడియో ద్వారా చెబుతానని తెలిపారు.






