Home

»

Latest News

హైదరాబాద్‌ లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన థియేటర్!

Jan 03, 2022

హైదరాబాద్‌ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు సమీపంలో ఉన్న శివ పార్వతి థియేటర్‌ లో సంభవించింది. అర్ధరాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో థియేటర్ కాలి బూడిదైంది.

శివ పార్వతి థియేటర్‌ లో 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఆదివారం సెకండ్ షో పూర్తయిన తరువాత అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. అయితే పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగడంతో  అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. థియేటర్‎ లో ఉన్న సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతి అవ్వటంతో సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అంటున్నారు. సెకండ్ షో పూర్తయిన తరువాత ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్దారణకు వచ్చినట్లు సమాచారం.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com