Home

»

Latest News

ఏప్రిల్ అంతా హార‌ర్ సినిమాలే!!

Mar 29, 2019 6:05PM

ఈ వేస‌విలో వ‌రుస‌గా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక ఏప్రిల్ నెల‌లో అయితే ప్ర‌తి వారం క‌నీసం రెండేసి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇంట్ర‌స్టింగ్ పాయింట్ ఏమిటంటే...ఏప్రిల్ లో ప్ర‌తి వారం ఒక హార‌ర్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ రిలీజ్ కు సిద్ధం కావ‌డం విశేషం.   ఏప్రిల్ 6న ఉగాది కానుక‌గా హార‌ర్ కామెడీ సినిమా `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2` వ‌స్తోంది.  అలాగే ఏప్రిల్ 12న ప్ర‌భుదేవా, త‌మ‌న్నా న‌టించిన హార‌ర్ కామెడీ ఫిల్మ్ `అభినేత్రి2` సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక రాఘ‌వ లారెన్స్ న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `కాంచ‌న 3` చిత్రం అదే నెల‌లో భ‌య‌పెట్టేందుకు సిద్ధ‌మైంది. నందిత కీల‌క పాత్ర‌లో న‌టించిన విశ్వామిత్ర కూడా ఏప్రిల్ లోనే థియేట‌ర్ లోకి వ‌చ్చేస్తోంది. ఇలా వ‌రుస హార‌ర్ చిత్రాల‌తో ఏప్రిల్ నెల ప్రేక్ష‌కుల‌ను మ‌రింత భ‌య‌పెట్ట‌నుంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com