
-థియేటర్స్ లోకి అడుగుపెట్టిన హే బలవంత్
-టాక్ ఎలా ఉంది
-హిట్టా! ఫట్టా!
-ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంది
ప్రచార చిత్రాలతో మూవీ లవర్స్, ప్రేక్షకుల్లో మంచి హైప్ ని క్రియేట్ చేసిన మూవీ 'హే బలవంత్'(Hey Balwanth). రిలీజ్ కి నాలుగు రోజుల ముందే 'హే భగవాన్' టైటిల్ ని హే బలవంత్ గా మార్చడంతో మరింత ఫ్రీ పబ్లిసిటీ వచ్చిందనే టాక్ కూడా సోషల్ మీడియాలో రన్ అవుతు ఉంది. ఈ నేపథ్యంలో రిలీజ్ ఈ రోజు అయినా నిన్న ప్రీమియర్స్ నుంచే థియేటర్స్ లో అడుగుపెట్టింది. ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ మాత్రం రావడం లేదు. కొన్ని హైలెట్స్ తో పాటు కథ మెయిన్ ఫ్లాట్ పై నెగిటివ్ ఆలోచన రాకుండా ఉంటే మూవీ పెద్ద హిట్ అనే అభిప్రాయాన్ని సదరు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం.
కథ మెయిన్ పాయింట్ ప్రకారం బలవంత్ అనే వ్యక్తి తన పేరుపై లాడ్జిని నడుపుతుంటాడు. సదరు లాడ్జిలో కొంత మంది ఆడవాళ్లు తమ జీవన భృతి కోసం శరీరాల్ని అమ్ముకుంటూ ఉంటారు. వాళ్లంతా అలా చెయ్యడానికి పలు రకాల కారణాలు ఉంటాయి.బలవంత్ కి కూడా ఒక కారణం ఉంటుంది. ఈ పాయింట్ ని పాజిటివ్ గా తీసుకుంటే సినిమా హిట్ రేంజ్ మరింత పెరుగుతుందని అంటున్నారు. హైలెట్స్ విషయానికి వస్తే
1 .బలవంత్ గా నరేష్ పెర్ ఫార్మెన్స్
2 .సుహాస్, శివాని నాగారం జర్నీ
3 .ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ ఎపిసోడ్
4 .హర్షవర్ధన్ క్యారక్టర్ డిజైన్
5 .ఇంటర్వెల్ బ్లాక్
6 .బలవంత్ లాడ్జి చుట్టూ జరిగిన కథ
7 . సెకండ్ హాఫ్ లో వచ్చిన నరేష్, సుహాస్ మధ వచ్చిన సెంటిమెంట్ సీన్స్
8 .క్లైమాక్స్
also read: toxic: టాక్సిక్ టీజర్ వచ్చేసింది.. ఫకింగ్ మానర్స్
ఆ విధంగా పలు అంశాలు మెప్పించాయని మెజారిటీ ప్రేక్షకులు చెప్తున్నారు. గోపి అచ్చెర(Gopi atchera)దర్శకత్వంలో నరేంద్ర రెడ్డి నిర్మించగా బన్నీ వాసు, వంశీ నందిపాటి సమర్పకులుగా ఉన్నారు. హర్షవర్ధన్, స్రవంతి,వెన్నెల కిషోర్, అన్నపూర్ణ,సుదర్శన్, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్యమైన క్యారక్టర్ లో కనిపించారు.








