Home

»

Latest News

50 సినిమాలు పూర్తిచేసిన ఛార్మి

Mar 7, 2011 4:10PM

heroine charmi, actress charmi, heroine charmi kour, charmi hot stills, charmi hit pics, charmi wall papers, అందాల పంజాబీ భామ హీరోయిన్ ఛార్మికౌర్ "నీతోడు కావాలి" చిత్రంతో హీరోయిన్ గా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే ప్రముఖ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. ఇటీవల విడుదలైన "మంగళ" చిత్రంతో ఛార్మి హీరోయిన్ గా అర్థశతచిత్రాలను అంటే 50 సినిమాలను పూర్తిచేసుకుంది. ఒకప్పుడు సావిత్రి, అంజలీదేవి, కృష్ణ కుమారి, షావుకారు జానకి వంటి వారు ఇలా వందల కొద్ది చిత్రాల్లో నటించేవారు.

ఆ తర్వాత జయప్రద, జయసుధ వంటి హీరోయిన్లు అలా వంద చిత్రాలకు పైగా పూర్తి చేసుకున్నారు. కానీ నేటి హీరోయిన్లు పట్టుమని పది చిత్రాలను కూడా పూర్తిచేయకుండానే కనుమరుగవుతున్నారు.ఇలాంటి సమయంలో ఛార్మి 50 చిత్రాలను పూర్తిచేయటం విశేషమనే చెప్పాలి. ఈ సందర్భంగా ఛార్మికి తెలుగువన్ శుభాకాంక్షలు తెలుపుతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com