Home

»

Latest News

మెగా హీరోకి వింత జ‌బ్బు

Oct 12, 2016 1:21PM

కార్తికేయ‌తో ఆక‌ట్టుకొన్నాడు చందూ మొండేటి. ప్రేమ‌మ్ సినిమా హిట్టుతో క్రేజీ డైరెక్ట‌ర్ల లిస్టులోకి చేరిపోయాడు. ప్రేమ‌మ్ రిలీజ్‌కి ముందు పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కానీ.. ఓ షో ప‌డిందో లేదో, సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చేసింది. ప్రేమ‌మ్ రిలీజ్ అయిన ద‌గ్గ‌ర నుంచీ చందూకి ఫోన్ల మీద ఫోన్లు. యంగ్ హీరోలంతా చందూకి కంగ్రాట్స్ చెప్పి, ప‌నిలో ప‌నిగా `మంచి క‌థ ఉంటే చెప్పు.. చేద్దాం` అంటూ ఆఫ‌ర్లు ఇస్తున్నారు. అయితే చందూ ఇప్ప‌టికే ఇద్ద‌రు హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి ఫిక్స‌యిపోయాడు. చందూ త‌దుప‌రి సినిమా వ‌రుణ్‌తేజ్‌తో అని టాక్‌. ఐ డ్రీమ్స్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ చందూతో ఓ సినిమా చేయ‌డానికిసిద్ద‌మైంది. క‌థ రెడీనే.  ప్ర‌స్తుతం స్క్రిప్టు వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ సినిమాలో హీరోగా వ‌రుణ్‌తేజ్ న‌టించ‌నున్నాడ‌ట‌. ఇది గ‌జిని టైపు స్టోరీ అట‌. హీరో కి మ‌తిమ‌రుపు జ‌బ్బు అని టాక్‌. ఇలాంటి క‌థ‌తో నేను మీకు తెలుసా?  భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాలొచ్చాయి. అవి బాగానే ఆడాయి. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ అయితే ట్రెండ్ సెట్ చేసింది. చందూ కూడా అలాంటి క‌థే రెడీ చేసుకొన్నాడ‌ట‌. మొత్తానికి వ‌రుణ్ తేజ్ గ‌జిని అవ‌తారం ఎత్త‌బోతున్నాడ‌న్న‌మాట‌. ఈ యేడాది డిసెంబ‌రులో ఈ సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్స్ ఉంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com