Home

»

Latest News

Karuppu: రూ. 300 కోట్ల క్లబ్‌లో 'కరుప్పు'.. అతనికి లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చిన హీరో సూర్య!

Jun 1, 2026 9:34AM

సినీ ఇండస్ట్రీలో ఒక సాలిడ్ హిట్ పడితే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసి, రికార్డులు బద్దలైనప్పుడు ఆ సక్సెస్ ఇచ్చే జోష్, సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) చాన్నాళ్ల తర్వాత అలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ సక్సెస్‌ను ఫుల్ జోష్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. 

సూర్య నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా మూవీ 'కరుప్పు' (Karuppu) బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లాంగ్ గ్యాప్ తర్వాత సూర్య ఖాతాలో పడిన ఈ క్రేజీ హిట్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తూ ఏకంగా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టిస్తోంది. ఇది సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

'కరుప్పు' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండటంతో, హీరో సూర్య తన చిత్ర యూనిట్‌కు చెందిన ముఖ్యమైన టెక్నీషియన్లకు ఖరీదైన బహుమతులు ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఈ సినిమాకు తన కెమెరా మ్యాజిక్‌తో అద్భుతమైన విజువల్స్ అందించి, సినిమాను విజువల్ వండర్‌గా మార్చిన సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు (GK Vishnu)కు సూర్య ఒక ఊహించని షాకింగ్ గిఫ్ట్ ఇచ్చారు. దాదాపు రూ. 30 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు భారీ విలువ కలిగిన సరికొత్త 'మహీంద్ర బీ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్' ఎలక్ట్రిక్ కారును జీకే విష్ణుకు బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. 

గతంలో 'మెర్సల్', 'బిగిల్', 'జవాన్' వంటి సినిమాలకు అద్భుతమైన కెమెరామెన్‌గా పనిచేసిన జీకే విష్ణు, ఈ ఖరీదైన కారు గిఫ్ట్ అందుకున్న విషయాన్ని తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇదంతా కేవలం దేవుడి దయ వల్లనే సాధ్యమైందని, తనకు ఇంతటి గొప్ప బహుమతిని అందించినందుకు "థాంక్యూ సూర్య సార్.. మీకు చాలా పెద్ద మనసు ఉంది" అంటూ కారుతో దిగిన ఫోటోను పోస్ట్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సినిమా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన టెక్నీషియన్లను, వారి కష్టాన్ని గుర్తించి హీరో సూర్య గౌరవిస్తున్న తీరుపై మెగా ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే సినిమాటోగ్రాఫర్‌కే ఇంతటి లగ్జరీ కారును కానుకగా ఇస్తే, మరి ఈ 'కరుప్పు' సినిమాను వెండితెరపై ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన మెయిన్ పిల్లర్, డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ (RJ Balaji)కి హీరో సూర్య ఇంకెలాంటి రేంజ్‌లో భారీ లగ్జరీ కార్ గిఫ్ట్‌గా ఇస్తాడో చూడాలంటూ నెటిజన్లు సోషల్ మీడియా ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా చాలా కాలం తర్వాత సూర్య ఖాతాలో రూ. 300 కోట్ల భారీ బ్లాక్‌బస్టర్ పడటంతో అభిమానులు ఫుల్ ఖుషీలో మునిగిపోయారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com