Home

»

Latest News

అలాంటి వాళ్లే రావాలంట.. నవదీప్ వ్యాఖ్యలు వైరల్ 

Aug 18, 2026 2:56PM

 


క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అద్భుత దృశ్య కావ్యం 'చందమామ' మూవీ వన్ ఆఫ్ ది హీరో నవదీప్. మెగాస్టార్ చిరంజీవి సన్నిహితుల ఫ్యామిలీ నుంచి వచ్చిన నవదీప్, క్యారక్టర్ కి తగ్గ పెర్ ఫార్మెన్స్ ప్రదర్శించడంలో దిట్ట. కానీ ఎందుకో హీరోగా,నటుడిగా పెద్ద ప్రభావం చూపించలేకపోతున్నాడు. 

 బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఈసారి సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే అరుదైన అవకాశం కల్పిస్తూ జియో హాట్‌స్టార్ వేదికగా 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2' డిజిటల్ ఆడిషన్లు నిర్వహిస్తున్నారు. నవదీప్ జడ్జి గా వ్యవహరిస్తున్నాడు.  ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రసారమవుతున్న ఈ డిజిటల్ ఆడిషన్లలో కంటెస్టెంట్ల ప్రతిభ, మానసిక సహనాన్ని పరీక్షించడానికి కఠినమైన టాస్కులు రూపొందించారు. అయితే ఈ ఆడిషన్స్ చుట్టూ ఇప్పుడు ఊహించని రీతిలో సోషల్ మీడియా వేదికగా తీవ్ర వివాదం రాజుకుంది.  సోషల్ మీడియాలో తన వైవిధ్యమైన డ్యాన్స్ వీడియోలు, రీల్స్‌తో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకున్న పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు ఈ 'అగ్నిపరీక్ష 2' ఆడిషన్స్‌లో పాల్గొన్నాడు. గ్రూప్ డిస్కషన్లు, పలు రకాల పోటీ రౌండ్లను విజయవంతంగా దాటుకుంటూ ఫైనల్ రౌండ్ వరకు చేరుకున్న బాలు, ఆఖరి నిమిషంలో ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన ఉప్పల్ బాలు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియో వదిలాడు. ఆడిషన్స్ పేరుతో తనను పిలిచి దారుణంగా అవమానించారని, ఫైనల్ రౌండ్‌లో ప్రతిభను చూడకుండా తాను చేసే వీడియోలు జుగుప్సాకరంగా (Vulgar) ఉన్నాయంటూ నలుగురిలో హీనంగా మాట్లాడి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని కన్నీటిపర్యంతమయ్యాడు.  ఈ వివాదంలో ప్రధానంగా జడ్జిగా వ్యవహరించిన ప్రముఖ నటుడు నవదీప్‌ను లక్ష్యంగా చేసుకుని బాలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. "మీరు చేసే వీడియోల వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? జడ్జి సీట్లో కూర్చున్నాం కదా అని మిడిల్ క్లాస్ నుంచి వచ్చి కష్టపడే మమ్మల్ని ఇలా తక్కువ చేసి మాట్లాడటం ఏమాత్రం తగదు" అని నవదీప్‌ని  నేరుగా ప్రశ్నించాడు.

Also read: నా జీవితంలో సంతోషాన్నిచ్చే ఒకే ఒక పని అదే.. వైరల్ అవుతున్నప్రముఖ నటి మాట 

 ఉప్పల్ బాలు ఆరోపణలపై  నవదీప్  స్పందిస్తూ 'హారర్ సినిమా చూడటానికి థియేటర్‌కు వచ్చి.. ఇక్కడ భయపెడుతున్నారు అని గోల చేస్తే ఎలా ఉంటుంది? 'అగ్నిపరీక్ష' అనే కాన్సెప్టే కంటెస్టెంట్లను మైండ్ గేమ్‌లతో ట్రిగ్గర్ చేయడం. షో డిజైన్ చేసిందే దానికోసం. నా లాంటి వాళ్లు ఎన్ని విమర్శలు, ఒత్తిళ్లు తెచ్చినా తట్టుకుని నిలబడే శక్తి, ధైర్యం ఉంటేనే ఈ షోకి రావాలి. అలా ఒత్తిడిని తట్టుకోలేని వాళ్లు అసలు బిగ్ బాస్ షోకే రావొద్దు" అంటూ నవదీప్ చెప్పుకొచ్చాడు. 

Navadeep, Tollywood, Krishnavamsi
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com