Home

»

Latest News

ఎన్టీయార్, బన్నీలను ముంచేసిన హేమ ఆంటీ!

Jun 28, 2016 3:59PM

అప్పుడెప్పుడో వచ్చిన రాంగోపాల్ వర్మ "క్షణం" సినిమాతో వెలుగులోకి వచ్చిన నటి హేమ, ఆ తర్వాత సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేస్తూ చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యింది. బ్రాహ్మానందం కాంబినేషన్ లో హేమ చేసిన సినిమాలు బాగా హిట్ అవ్వడంతో.. ఒకానొక దశలో బ్రహ్మానందంకి సినిమాలో భార్య పాత్ర ఉందంటే వెంటనే "హేమ" ఫోన్ మ్రోగేది. ఆ తర్వాత హేమ ఆంటీ పాత్రల్లో నటిస్తూ తన ఉనికిని చాటుకుటూ వచ్చింది. అయితే.. ఈవిడకి ఈమధ్య అవకాశాలు తగ్గాయి. లో బడ్జెట్ సినిమాల్లో తప్పితే ఓ మోస్తరు సినిమాల్లో హేమ కనిపించి చాలా సంవత్సరాలైపోయింది. ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గినా తాను మాత్రం ఇండస్ట్రీ వదిలిపోయేది లేదంటున్నది హేమ.. పనిలో పనిగా యువతరం కథానాయకులపై పొగడ్తల వర్షం కురిపిస్తూ వారి ఆదరణను చూరగొనాలని విశ్వప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే అల్లు అర్జున్ డ్యాన్సులంటే తనకు బాగా ఇష్టమని, ఎన్టీయార్ గుక్కతిప్పుకోకుండా డైలాగులు చెప్పే విధానమంటే తనకు అమితమైన ఇష్టమని చెబుతూనే వారిపై ప్రశంసలతో ముంచెత్తింది. మరి ఈ ప్రశంసల వాన వారివరకూ చేరి.. ఈవిడగారిని తమ సినిమాల్లో నటింపజేసుకొంటారో లేదో చూడాలి!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com