Home

»

Latest News

నాగ్, ర‌మ్య జోడికి మ‌రో సంక్రాంతి హిట్ ద‌క్కేనా!

Jan 12, 2022

తెలుగువారిని విశేషంగా అల‌రించిన వెండితెర జంటల్లో కింగ్ నాగార్జున, వెర్స‌టైల్ యాక్ట్ర‌స్ ర‌మ్య‌కృష్ణ జోడీ ఒక‌టి. `సంకీర్త‌న‌` (1987) కోసం తొలిసారిగా జ‌ట్టుక‌ట్టిన నాగ్, ర‌మ్య‌.. ఆపై `ఇద్ద‌రూ ఇద్ద‌రే` (1990), `అల్ల‌రి అల్లుడు` (1993), `హ‌లో బ్ర‌ద‌ర్`, `క్రిమిన‌ల్` (1994), `ఘ‌రానా బుల్లోడు`, `క్రిమిన‌ల్` (హిందీ) (1995), `అన్న‌మ‌య్య‌` (1997), `చంద్ర‌లేఖ‌` (1998), `సోగ్గాడే చిన్ని నాయ‌నా` (2016)లో క‌నువిందు చేశారు. వీటిలో `అల్ల‌రి అల్లుడు` (ర‌మ్య ప్ర‌త్యేక గీతం), `హ‌లో బ్ర‌ద‌ర్`, `ఘ‌రానా బుల్లోడు`, `అన్న‌మ‌య్య‌`, `సోగ్గాడే చిన్ని నాయ‌నా` చిత్రాలు బాక్సాఫీస్ విన్న‌ర్స్ గా నిలిచాయి. క‌ట్ చేస్తే.. ఇప్పుడీ హిట్ పెయిర్ `బంగార్రాజు`తో మ‌రోసారి ప‌ల‌క‌రించ‌బోతోంది. జ‌న‌వ‌రి 14న ఈ విలేజ్ డ్రామా తెర‌పైకి రాబోతోంది.

కాగా, `సోగ్గాడే చిన్ని నాయ‌నా`కి కొన‌సాగింపు చిత్రంగా రూపొందిన `బంగార్రాజు`లోనూ బంగార్రాజు, స‌త్య‌భామ పాత్ర‌ల్లో ఎంట‌ర్టైన్ చేయ‌నున్నారు నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ‌. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. ఇంత‌కుముందు నాగ్, ర‌మ్య స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమాల్లో ఒక్క `సోగ్గాడే చిన్ని నాయ‌నా` మాత్ర‌మే సంక్రాంతి సీజ‌న్ లో రిలీజైంది. మ‌ళ్ళీ ఇప్పుడు `బంగార్రాజు`తో మ‌రోసారి పొంగ‌ల్ టైమ్ కి రాబోతోందీ ఈ స‌క్సెస్ ఫుల్ జోడీ. మ‌రి.. `సోగ్గాడే చిన్ని నాయ‌నా`లాగే `బంగార్రాజు` కూడా విజ‌య‌పథంలో ప‌య‌నించి.. నాగ్, ర‌మ్య జంట‌కి మ‌రో సంక్రాంతి హిట్ ని అందిస్తుందేమో చూడాలి. 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com