Home

»

Latest News

Harish Shankar: నెక్స్ట్ ఏంటి అన్నయ్య... అనౌన్స్ మెంట్ ఎప్పుడు 

May 02, 2026

 

కొంత మంది దర్శకుల సినీ జర్నీగురించి చెప్పుకోవడం స్టార్ చేస్తే చాలు నా ప్రతి అక్షరం పంచ్ లతో ఉండేలా చూడవా అని అక్షరమే అడిగే పరిస్థితి. అలాంటి  దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar). ఊహించని డైలాగ్స్, పంచ్ లకి బ్రాండ్ అంబాసిడర్. అందుకే భారీ అభిమాన ఘనాన్ని సంపాదించుకున్నాడు. మార్చి లో తన బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో కలిసి  ఉస్తాద్ భగత్ సింగ్ గా వచ్చాడు. ప్రారంభంలో హిట్ సువాసనలతో కనపడిన ఉస్తాద్ తొలి రోజు ముగిసేసరికి పరాజయాన్ని ఖాయం చేసుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా హరీష్ శంకర్ అప్ కమింగ్ సినిమాల గురించి చర్చ జరుగుతుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం 

ప్రెజెంట్ హరీష్ శంకర్ నుంచి ఎలాంటి కొత్త చిత్రం ప్రకటన రాలేదు. కనీసం గాసిప్ గానైనా   ఏ హీరో పేరు వినపడటం లేదు. బాలకృష్ణతో మూవీ ఉండబోతోందనే న్యూస్ కొన్ని రోజుల క్రితం వచ్చింది. కానీ కొరటాల శివ(Koratal siva)కి బాలకృష్ణ(Balakrishna)కమిట్ అయ్యాడు. ఇతర బడా హీరోలెవరు ఖాళీగా లేరు. పైగా ఒక సినిమా స్టార్ట్ చేస్తే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూస్తూనే ఉన్నాం. తన మరో బాస్ రవితేజ కూడా ఫుల్ బిజీ. మరి ఈ  టైంలో హరీష్ శంకర్ ముందున్న మార్గం మెగా కాంపౌండ్. ఆ కాంపౌండ్ లో ఉన్న వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో అవకాశం వస్తుందేమో. ఈ ముగ్గరు బిజీగా ఉన్నా హరీష్ శంకర్ కథ చెప్పి ఒప్పిస్తే చేసే అవకాశం ఉండవచ్చని సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


Also read: 2026 లో ఇప్పటి వరకు తొలి రోజు హయ్యస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాలివే  

ఏది ఏమైనా మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ పరాజయాలతో ప్రస్తుతం హరీష్ శంకర్ పెన్ను హిట్ కోసం పొద్దుటూరు ఖద్దర్ లాగా కుత కుత లాడుతూ ఉండటం ఖాయం. ఈ నేపథ్యంలో ఏ హీరోతో వస్తాడో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com