Home

»

Latest News

రీమేక్‌నే నమ్ముకున్న ద‌ర్శ‌కుడు!!

Nov 15, 2018 10:25AM

ఇటీవ‌ల కాలంలో హ‌రిష్ శంక‌ర్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడ‌టం లేదు.  దిల్ రాజు బేన‌ర్ లో ఒక సినిమా ఉందంటూ వార్త‌లు వ‌చ్చినప్ప‌టికీ అది వ‌ర్క‌వుట్ కాలేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో `ద‌బాంగ్` సినిమాను తెలుగ‌లో `గ‌బ్బ‌ర్ సింగ్` గా రీమేక్ చేసి స్టార్ ద‌ర్శ‌కుల్లో చేరిపోయిన ఈ ద‌ర్శ‌కుడు మ‌రోసారి రీమేక్ నే న‌మ్ముకున్న‌ట్టు తెలుస్తోంది.  ఒక‌సారి ఆ వివ‌రాల్లోకి వెళితే...  కోలీవుడ్ లో సూప‌ర్ హిట్ మూవీ `జిగ‌ర్తాండ్రా` చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌నుకుంటున్నాడ‌ట ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన రైట్స్ తీసుకుని  తెలుగు కి త‌గ్గ‌ట్టుగా స్క్రిప్టు వ‌ర్క్ కూడా పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. కార్తిక్ సుబ్బరాజ్ రూపొందించిన ఈ చిత్రం ప‌లు జాతీయ అవార్డుల‌ను కూడా సొంతం చేసుకుంది. థ్రిల్ల‌ర్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈచిత్రాన్ని 14 రీల్స్ నిర్మించ‌నుంద‌ట‌. త్వ‌ర‌లో న‌టీన‌టుల వివ‌రాలు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. చూద్దాం ఈ రీమేక్ తో అయినా హ‌రీష్ గ‌ట్టుక్కుతాడేమో!!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com