Home

»

Latest News

హరిహరవీరమల్లు నయా రికార్డ్.. వామ్మో అన్ని షో లా! 

Jul 23, 2025 1:21PM

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)మొట్టమొదటి సారిగా చేసిన చారిత్రాత్మక చిత్రం 'హరిహరవీరమల్లు'(Hari Hara Veeramallu)రేపు వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటు వస్తున్నాడు. రీసెంట్ గా 'విజయవాడ(VIjayawada)లో' మీడియాతో ముచ్చటిస్తు 'వీరమల్లు' అభిమానులతో పాటు ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తుందని చెప్పుకొచ్చాడు.

 'వీరమల్లు' తొలి రోజుకి సంబంధించి వరల్డ్ వైడ్ గా 3000 షోస్ ని ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తుంది.  టికెట్స్  కూడా తొలి రోజు అన్ని షోస్ కి హౌస్ ఫుల్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో వీరమల్లు రిలీజ్ రోజు సరికొత్త రికార్డులు సృష్టిస్తోందనే ఆశాభావాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వీరమల్లు ని మెగా సూర్య ప్రొడక్షన్స్ పై సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం(Am Rathnam)నిర్మించగా, ఆయన తనయుడు జ్యోతికృష్ణ(Jyothi Krishna)దర్శకత్వం వహించాడు.

నిధి అగర్వాల్(Nidhhi Agerwal)బాబీడియోల్, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, రఘుబాబు, అనసూయ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. కీరవాణి(Keeravani)సంగీతంలో వచ్చిన పాటలు ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందాయి. వీరమల్లు కొంత భాగానికి క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi)దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా 'క్రిష్' 'ఎక్స్'  వేదికగా వీరమల్లు గురించి ప్రస్తావిస్తు వీరమల్లు చాలా పవర్ ఫుల్ సబ్జెట్ అని తప్పకుండా విజయం సాధిస్తుందంటు ట్వీట్ చేసాడు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com