Home

»

Latest News

'హరి హర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్ లాక్.. ఆ ఇద్దరు హీరోలకు షాక్!

Mar 10, 2025 5:04PM

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu). షూటింగ్ చివరి దశలో ఉంది. మార్చి 28న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడినట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన రానప్పటికీ.. వాయిదా అనేది లాంఛనమే. తాజాగా మేకర్స్ సైతం కొత్త విడుదల తేదీని లాక్ చేసినట్లు సమాచారం. 

 

'హరి హర వీరమల్లు' చిత్రాన్ని దాదాపు ఐదేళ్ల క్రితం ప్రకటించారు. పాండమిక్, పవన్ పాలిటిక్స్ తో బిజీ వంటి కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. దాంతో విడుదల తేదీలు మారుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఈ సినిమాని 2025, మార్చి 28న విడుదల చేయనున్నట్లు గతేడాది ప్రకటించారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే మిగిలిన షూటింగ్ ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారు. విజయవాడ సమీపంలో వేసిన భారీ సెట్స్ లో కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా పవన్ కళ్యాణ్ బాగా బిజీగా ఉండటంతో, షూటింగ్ కి మళ్ళీ బ్రేక్ పడింది. పవన్ తన షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేయాలంటే ఇంకా వారం పదిరోజులు డేట్స్ కేటాయించాల్సి ఉంది అంటున్నారు. త్వరలోనే బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేయడానికి డేట్స్ ఇస్తానని పవన్ చెప్పారట. దాంతో మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. మే 9న ఈ సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశముందని చెబుతున్నారు.

 

నిజానికి మే 9న చిరంజీవి 'విశ్వంభర'ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు ఆ మూవీ ఆగస్టుకి వాయిదా పడినట్లు సమాచారం. అలాగే మే 9వ తేదీపై రవితేజ 'మాస్ జాతర', నితిన్ 'తమ్ముడు' సినిమాలు ఇప్పటికే కర్చీఫ్ వేశాయి. ఇప్పుడు 'హరి హర వీరమల్లు' మే 9కి వస్తే.. ఆ రెండు సినిమాలు వెనకడుగు వేసే అవకాశముంది. ముఖ్యంగా 'తమ్ముడు' సినిమా వాయిదా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.

 

ఇంకో విశేషం ఏంటంటే, నితిన్ నటిస్తున్న మరో సినిమా 'రాబిన్ హుడ్' మార్చి 28న విడుదలవుతోంది. 'హరి హర వీరమల్లు' వాయిదా పడుతుందనే నమ్మకంతో నితిన్ ఆ తేదీపై కన్నేశాడు. అనుకున్నట్టే 'హరి హర వీరమల్లు' వాయిదా పడుతోంది కానీ, అనూహ్యంగా అది నితిన్ మరో సినిమా డేట్ పై కన్నేయడం ఆసక్తికరంగా మారింది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com